విదేశాల నుంచి 10 లక్షల మాస్కులు

విదేశాల నుంచి 10 లక్షల మాస్కులు

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి సుమారు పది లక్షల మాస్కులు అత్యవసరంగా దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఇండియన్ కంపెనీలతో మరిన్ని పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ) తయారు చేయించేందుకు చర్చలు జరుపుతోంది. కొవిడ్-19 టెస్టులు చేసేవారు, కరోనా వైరస్ పేషెంట్లను ట్రీట్​చేసేవారు పీపీఈలను వాడుతారు. “ఇప్పటికే షార్టేజ్ వచ్చింది. కరోనా పాజిటివ్ కేసులు పెరిగితే.. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంది. సుమారు 10 లక్షల మాస్కులు కావాలని  వివిధ దేశాలు తయారీదారులను విదేశాంగ శాఖ కోరుతోంది. ప్రస్తుతం వాడుతున్న పీపీఈ కిట్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే” అని హెల్త్ మినిస్ట్రీ కు చెందిన ఓ అధికారి చెప్పారు. మన దేశానికి 3.8 కోట్ల మాస్క్ లు అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే 62 లక్షల పీపీఈ కిట్లు కావాల్సి ఉందంటున్నారు. వెంటిలేటర్లు, ఐసీయూ మానిటర్లు, ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ల కోసం 730 కంపెనీలను సంప్రదించినట్లు ‘ఇన్వెస్ట్ ఇండియా’ సంస్థ చెప్పింది. వాటిలో 319 సంస్థలు స్పందించినట్లు తెలిపింది.

టోక్యో ఒలిం పిక్స్ 2021 జులై 23 నుంచి.!