28 రాష్ట్రాలకు 47,541 కోట్లు.. తెలంగాణకు 1998 కోట్లు రిలీజ్

28 రాష్ట్రాలకు 47,541 కోట్లు.. తెలంగాణకు 1998 కోట్లు రిలీజ్

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రానికి జనవరి నెలవారీ వాటా కింద రూ.999.31 కోట్లు, అడ్వాన్స్ కింద మరో రూ.999.31 కోట్లను కేంద్రం రిలీజ్ చేసింది. దీంతో జనవరిలో రాష్ట్రానికి రూ.1,998.62 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే పన్ను బకాయిలతో పాటు రూ.47,541 కోట్లు రెండవ ముందస్తు వాయిదా మొత్తాన్ని విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌‌ పేర్కొన్నారు. దీంతో ప్రస్తుత జనవరిలో రాష్ట్రాలకు మొత్తం రూ.95,082 కోట్లు విడుదల అయ్యాయని తెలిపారు. ఇందులో ఏపీకి  రూ.3,847.96 కోట్లు విడుదల చేసింది. పన్ను పంపిణీకి సంబంధించిన ఫస్ట్ అడ్వాన్స్ ఇన్​స్టాల్మెంట్ మొత్తాన్ని రాష్ట్రాలకు రూ.47,541 కోట్లు గత నవంబర్‌‌ 22వ తేదీన కేంద్రం రిలీజ్ చేసింది. తాజా ఇన్​స్టాల్మెంట్ రిలీజ్​తో రాష్ట్రాలు బడ్జెట్‌‌లో విడుదల చేసిన దానికంటే పన్నుల పంపిణీ కింద రూ.90,082 కోట్లు అధికంగా పొందాయని పేర్కొంది.