బాయిల్డ్ రైస్ కోటా పెంచిన కేంద్రం

 బాయిల్డ్ రైస్ కోటా పెంచిన కేంద్రం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి 6.05 లక్షల టన్నుల బాయిల్డ్​ రైస్ సేకరించేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది. ఈ మేరకు బుధవారం కేంద్ర ప్రజా పంపిణి శాఖ, రాష్ట్రానికి సమాచారం ఇచ్చింది. 6.05 లక్షల టన్నుల్లో 2.60 లక్షల టన్నులను ఫోర్టిఫైడ్​ రైస్​ రూపంలో తీసుకుంటామని, మిగతా 3.45 లక్షల టన్నులను బాయిల్డ్​ రైస్​ రూపంలో సేకరిస్తామని కేంద్రం తెలిపింది. ఈ నిర్ణయం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బియ్యం సేకరణకు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ అంగీకరించడంపై తెలంగాణ రైతుల పక్షాన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
3.45 లక్షల టన్నుల బాయిల్డ్​ రైస్​ తీసుకుంటం
అలాగే 2021-–22కు గాను అంచనాలను సవరిస్తూ మొత్తం 6.05 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్​ను రాష్ట్రం నుంచి సేకరించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులను ఆదుకునేందుకు రాష్ట్రం నుంచి అదనంగా 2.50 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ తీసుకోవాలని ఏప్రిల్​నెల 28న కేంద్ర మంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు.

అదే సందర్భంలో 2020-–21 కు సంబంధించి రాష్ట్రం నుంచి కేంద్రానికి సరఫరా చేయాల్సిన బాయిల్డ్ రైస్ గడువును మరోసారి పెంచాలని కోరినట్లు చెప్పారు. అయితే, తాను కోరిన దానికంటే అదనంగా 3.45 లక్షల టన్నులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ అనుమతి ఇవ్వడంపై తెలంగాణ రైతుల పక్షాన కిషన్ రెడ్డి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.