70.22 లక్షల టన్నులతో తెలంగాణ థర్డ్‌‌ ప్లేస్‌‌

70.22 లక్షల టన్నులతో తెలంగాణ థర్డ్‌‌ ప్లేస్‌‌
  • రూ.1.36 లక్షల కోట్ల విలువైన ధాన్యం కొన్న కేంద్రం
  • 1.86 కోట్ల టన్నులతో టాప్‌‌ ప్లేస్‌లో పంజాబ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ ఈయేడు వానాకాలంలో మద్దతు ధరతో దేశ్యాప్తంగా 6 కోట్ల 95 లక్షల టన్నుల ధాన్యం  సేకరించింది. దేశంలోని 94.15 లక్షల మంది రైతుల నుంచి మద్దతు ధరతో రూ.1.36 లక్షల కోట్ల విలువైన ధాన్యం  కేంద్రం సేకరించింది. వరి పండించే రాష్ట్రాల్లో ఎఫ్‌‌సీఐ ద్వారా ధాన్యం సేకరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 20 నాటికి దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, యూటీల నుంచి ధాన్యం సేకరించింది.

టాప్‌‌ ప్లేస్‌‌ లో పంజాబ్‌‌.. థర్డ్‌‌ ప్లేస్‌‌ లో తెలంగాణ

కేంద్రం సోమవారం ప్రకటించిన లెక్కల ప్రకారం పంజాబ్‌‌లో అత్యధికంగా కోటి 86 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. తరువాత చత్తీస్‌‌గఢ్‌లో 92.01 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. 70.22 లక్షల టన్నులతో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో యూపీ, ఐదో స్థానంలో హర్యానా, ఆరో స్థానంలో ఒడిషా, ఏడో స్థానంలో మధ్యప్రదేశ్‌‌, 8వ స్థానంలో బీహార్‌‌, 9వ స్థానంలో ఏపీ, పదో స్థానంలో మహారాష్ట్ర నిలిచాయి.

టాప్‌‌ 10 స్థానాల్లో ఉన్న రాష్ట్రాల ధాన్యం సేకరణ వివరాలు

రాష్ట్రం            ధాన్యం (లక్షల టన్నుల్లో)

1. పంజాబ్‌‌            186.55

2. చత్తీస్‌‌గఢ్‌‌         92.01

3. తెలంగాణ       70.22

4. యూపీ             64.04

5. హర్యానా          55.30

6. ఒడిశా              49.37

7. మధ్యప్రదేశ్‌‌   45.82

8. బిహార్‌‌             42.50

9. ఆంధ్రప్రదేశ్‌‌  34.49

10. మహారాష్ట్ర   13.29