
న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ల కోసం కేంద్ర ప్రభుత్వం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి డ్రాఫ్ట్ పేపర్లను సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఎల్ఐసీలో 5 శాతం ఈక్విటీ వాటాను అమ్మాలని కేంద్రం భావిస్తోంది. దీనికి సంబంధించి మార్చి నెలలో క్యాపిటల్ మార్కెట్ లోకి పబ్లిక్ ఆఫర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెబీకి అందజేసిన డ్రాఫ్ట్ ప్రకారం.. ఎల్ఐసీలో 31 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మనున్నట్లు తెలుస్తోంది. ఈ ఐపీఓలో కొంత భాగాన్ని యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించ నున్నారు. అలాగే పాలసీ హోల్డర్లకు 10 శాతం అలకేట్ చేయనున్నారు.