త్వరలో సముద్రయాన్

త్వరలో సముద్రయాన్

కేంద్ర ప్రభుత్వం మరో భారీ సైన్స్ మిషన్ చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. సముద్రయాన్ ప్రాజెక్టులో భాగంగా ముగ్గురు ఆక్వానాట్ లను సముద్రంలో 6 కిలోమీటర్ల లోతుకు పంపి పరిశోధనలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం చెన్నైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్​ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) సైంటిస్టులు గోళాకారంలోని సబ్ మెర్సిబుల్ వెహికల్ ‘మత్స్య 6000’ను రెండేండ్లు శ్రమించి నిర్మించారు. 

సోమవారం ఎన్ఐఓటీని సందర్శించిన కేంద్ర మంత్రి రిజిజు ఈ ఫొటోలను ట్వీట్ చేశారు. ఫస్ట్ ఫేజ్ లో వచ్చే ఏడాది ముగ్గురు ఆక్వానాట్ లను అర కిలోమీటర్ లోతుకు పంపి ట్రయల్స్ చేయనున్నారు. ఆ తర్వాత 2026 నాటికి 6 వేల మీటర్ల లోతుకు పంపనున్నారు. ఈ మిషన్ ద్వారా సముద్ర గర్భంలో 6 కిలోమీటర్ల దిగువన నికెల్, కోబాల్ట్, మాంగనీస్, గ్యాస్ హైడ్రేట్ నిక్షేపాల కోసం అన్వేషించడంతోపాటు అక్కడ నివసించే విభిన్నమైన జీవజాలాన్ని కూడా గుర్తించనున్నారు.