అనాథలకు ఆసరైతున్నస్వచ్ఛంద సంస్థలు

అనాథలకు ఆసరైతున్నస్వచ్ఛంద సంస్థలు

హైదరాబాద్, వెలుగు: రోడ్లమీదే ఉంటూ, ఎవరైనా పెట్టింది తింటూ.. కాలం గడుపుతున్న అభాగ్యులు, మతిస్థితిమితం లేనివాళ్ల పరిస్థితి ఇప్పుడు మరింత దయనీయంగా మారింది. లాక్​డౌన్​లో జనం బయటకి రాకపోవడం వల్ల ఒక్క పూట కడుపు నిండడం కూడా కష్టమైతోంది. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వారికి తెలియదు. అలాంటి వాళ్లను కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేరదీస్తున్నాయి. ఆశ్రయం కల్పించి ఆకలి తీరుస్తున్నాయి.

‘సంకల్ప్’​ నైట్ రెస్క్యూ

జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పని చేస్తున్న ‘సంకల్ప్’ ఫౌండేషన్ రోడ్ల వెంట ఉండే మతిస్థిమితం లేని వారికి, యాచకులకు షెల్టర్ కల్పిస్తోంది. మార్చి27 నుంచి స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తోంది. ముందుగా నైట్​టైం ఏయే ప్రాంతాల్లో ఇలాంటి వారున్నారో గుర్తించి ఆ రిపోర్ట్ ని జీహెచ్ఎంసీకి అందిస్తుంది. ఆ తర్వాత పోలీసులు, బల్దియా సిబ్బంది సాయంతో షెల్టర్స్ కి తరలిస్తుంది. కొందరిని రిహాబిలిటేషన్ సెంటర్ కి పంపించి, కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేందుకు యోగా, మెడిటేషన్, రిక్రియేషన్ వంటివి చేయిస్తున్నారు. 3 నెలలు అబ్జర్వేషన్ లో ఉంచి అనంతరం తెలిసిన వాళ్లు వస్తే పంపించనున్నారు. లేదంటే వారికి ఓ ఆధారం చూపిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.ఇప్పటివరకూ 200 మందికి షెల్టర్​ కల్పించారు.

మాస్క్​లు, ఫుడ్​ పంపిణీ..

సర్వ్ ది నీడీ, ఫీడ్ ది హంగర్ వంటి స్వచ్ఛంద సంస్థలు ప్రధానంగా మతిస్థిమితం లేనివారిని గుర్తించి అండగా నిలుస్తున్నాయి. అన్నం, పండ్లు, గుడ్లు, బిస్కెట్లతో పాటు మాస్క్ లు అందిస్తున్నాయి. ఇంటి నుంచి పారిపోయి వచ్చిన వాళ్లు, హాస్పిటల్స్, బస్టాప్స్ వద్ద ఉంటున్న వారికీ ఫుడ్​ అందిస్తున్నాయి.