గాంధీ ఆస్పత్రిలో  సంతాన సాఫల్య కేంద్రం ప్రారంభం

 గాంధీ ఆస్పత్రిలో  సంతాన సాఫల్య కేంద్రం ప్రారంభం
  • గాంధీ ఆస్పత్రిలో  సంతాన సాఫల్య కేంద్రం
  • ప్రారంభించిన హోంమంత్రి మహమూద్​ అలీ

పద్మారావునగర్, వెలుగు : గాంధీ ఆస్పత్రిలోని ఎంసీహెచ్​  బిల్డింగ్​లో ఏర్పాటు చేసిన సంతాన సాఫల్య కేంద్రం (ఐవీఎఫ్)ను ఆదివారం రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ ఐవీఎఫ్​ సెంటర్​ పేదలకు వరం లాంటిదని అన్నారు. కార్పొరేట్​ఆస్పత్రుల్లో లక్షల విలువ చేసే సంతాన సాఫల్య వైద్యం గాంధీ ఆస్పత్రిలో పేదలకు ఉచితంగా అందించడానికి ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయమన్నారు.

రూ.5 కోట్లతో ఈ సెంటర్​ను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న దంపతులు దీనిని వినియోగించుకోవాలని కోరారు. మాతా శిశు సంరక్షణ కోసం సీఎం కేసీఆర్​ అనేక పథకాలు అమలు చేస్తున్నారని హోంమంత్రి అన్నారు. సంతానం కోసం పేద, మధ్య తరగతి ప్రజలు లక్షలాది రూపాయలు అప్పు చేసి ప్రైవేట్​ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని, అలాంటి వారికి గాంధీ ఐవీఎఫ్​​ సెంటర్​ ఎంతో ఉపయోగపడుతుందని టీఎస్​ఎమ్​ఎస్​ ఐడీసీ చైర్మన్​ ఎర్రోళ్ల శ్రీనివాస్​ అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్​ శ్రీలత, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్​ రాజారాం, ఇన్​చార్జ్​ డీఎంఈ వాణిదేవి, సీఎం ఓఎస్​డీ గంగా ధర్​, ఆయా డిపార్ట్​మెంట్​ల హెచ్​వోడీలు, డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

రెగ్యులరైజ్​ చేయాలని నర్సుల వినతి

తమను రెగ్యులరైజ్​ చేయాలని, 3 నెలలుగా పెండింగ్​లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలని గాంధీ ఔట్​సోర్సింగ్, కాంట్రాక్ట్ నర్సులు హోంమంత్రి మహ మూద్​ అలీని కోరారు. గత 15 రోజులుగా తాము సమ్మె చేస్తున్నా ఎవరూ పట్టిచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని నర్సులకు హోంమంత్రి హామీ ఇచ్చారు.