మా అమ్మను వెతికిపెట్టండి.. పోలీసులకు ఫిర్యాదు

మా అమ్మను వెతికిపెట్టండి.. పోలీసులకు ఫిర్యాదు

తమ తల్లి కనిపించడం లేదంటూ ఇద్దరు పిల్లలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తమ తల్లి అదృశ్యమై 15 రోజులు అవుతుందని ఆమె ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను కోరారు. అమ్మా త్వరగా రా అంటూ ఆ పిల్లలు కంటతడి పెడుతున్నారు. ఇప్పటివరకు ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇంటి నుంచి ఏమి తీసుకువెళ్లలేదని ఆమె ఒక్కటే వెళిపోయిందని చెబుతున్నారు. తమ తండ్రిపైనా ఎలాంటి అనుమానం లేదంటున్నారు. 

జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని జవహర్ నగర్‭లో నివాసం ఉంటున్న శ్రావణి అదృశ్యమైంది. శ్రావణి భర్త సురేష్ కారు డ్రైవర్‭గా పనిచేస్తుండగా.. ఆమె ఓ ప్రైవేట్ సంస్థలో ఆఫీస్ క్లర్క్ గా పనిచేస్తోంది. వీరికి హర్ష, శరణ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవని స్థానికులు చెబుతున్నారు. గొడవల కారణంగానే శ్రావణి వెళిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.