
హైదరాబాద్, వెలుగు : జాతకాలు, పూజల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఆన్‌లైన్ జ్యోతిష్యున్ని సిటీ సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్‌కి తరలించారు. వివరాలను జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ వెల్లడించారు. పంజాబ్ మొహాలికి చెందిన లలిత్ (38) ప్రముఖ జ్యోతిష్యునిగా ఆన్‌లైన్‌లో పోస్టింగ్స్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రొఫైల్ తో అకౌంట్ క్రియేట్ చేశాడు. love astrologer ‘గోపాల్ శాస్త్రి’ అని గూగుల్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో astro-gopal పేరుతో ఫోన్ నంబర్, మెయిల్ ఐడీస్ అప్‌లోడ్ చేశాడు. పూజలతో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పాడు. ఇది చూసిన హైదరాబాద్ వాసి 3 నెలల కింద ఇన్‌స్టాగ్రామ్‌లో లలిత్‌ను సంప్రదించాడు. పూజలు చేస్తానని చెప్పి రూ.32 వేలు వసూలు చేశాడు. ఇలా వివిధ కారణాలతో మొత్తం రూ.47.11లక్షలు తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా ఎలాంటి పూజలు చేయకపోగా, ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడు లలిత్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు.