పల్లెకు వెళ్లిన పట్నం.. బోసిపోయిన సిటీ.. తగ్గిన కాలుష్యం

పల్లెకు వెళ్లిన పట్నం.. బోసిపోయిన సిటీ.. తగ్గిన కాలుష్యం

హైదరాబాద్: పట్నం పల్లెకు కదిలింది. సంక్రాంతికి పెద్దఎత్తున జనం ఊర్లకు వెళ్లడంతో హైదరాబాద్ లో రోడ్లు బోసి పోయాయి. ఎప్పుడూ రద్దీగా కన్పించే ప్రధానకూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. వాహనాల రాకపోకలు లేకపోవడంతో సిటీలో కాలుష్యం కూడా తగ్గింది. 
సంక్రాంతి పండుగతో హైదరాబాద్ కళ తప్పింది. స్కూళ్లు, కాలేజీలకు ఎక్కువ రోజులు సెలవులు ప్రకటించడంతో చాలా మంది సొంతూళ్లకు వెళ్లారు. దీంతో దాదాపు సగం సిటీ ఖాళీ అయింది. రోడ్లపై వాహనాల రద్దీ కూడా తగ్గింది. ఎప్పుడు ట్రాఫిక్ తో రద్దీగా ఉండే పంజాగుట్ట, అమీర్ పేట్, కోఠి, బేగంపేట్, సికింద్రాబాద్ ఏరియాలు బోసిపోయి కన్పిస్తున్నాయి. ఐటీ సెక్టార్ లో గచ్చిబౌలి, మణికొండ, మాదాపూర్, కొండాపూర్ ఏరియాల్లో జనం లేక చాలా ఫ్రీగా కన్పిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్స్ లేకపోవడంతో జర్నీ టైం కూడా తగ్గింది. 
కరోనా కేసులు పెరగడం, ఒమిక్రాన్ వ్యాపిస్తుండటంతో మళ్లీ కొన్ని సంస్థలు వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. విద్యా సంస్థలకు వారం రోజులు సెలవులు ఇచ్చారు. ఇంకా పొడిగిస్తారన్నవార్తలతో చాలా మంది విద్యార్థులు హాస్టల్స్, రూంలు ఖాళీ చేసి బుక్స్ తీసుకొని వెళ్లారు. దీంతో విద్యార్థులు సొంతూళ్లలోనే ఉండే ఛాన్సుంది. వర్క్ ఫ్రం హోం కాకుండా ఖచ్చితంగా ఆఫీసుకు వెళ్లాల్సిన వారు సోమ, మంగళవారాల్లో సిటీకి వచ్చే అవకాశముంది. ఇక కార్మికులు, చిన్న ఉద్యోగులు ఇళ్ళకు వెళ్లడంతో రోడ్ సైడ్ వ్యాపారాలు తగ్గాయి. వాహనాలు లేకపోవడంతో సిటీలో కాలుష్యం కూడా తగ్గిదంటున్నారు జనం.  సంక్రాంతికి ఊరు వెళ్లిన వారు వెళ్లగా... ఇక్కడ ఉన్న వారు ట్రాఫిక్ తగ్గిందనీ... పొల్యూషన్ కంట్రోల్ అయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

బేగంబజార్ లో నైట్ కైట్ ఫెస్టివల్

రిపబ్లిక్ డే వేడుకలు ఇకపై జనవరి 23 నుంచే ప్రారంభం

కొవిడ్ ఎఫెక్ట్: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు