
జన్నారం, వెలుగు: సీఎం రిలీఫ్ ఫండ్‌తో నిరుపేదలకు ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఆదివారం జన్నారం మండలంలోని పలుగ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలిఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ రాజారాంరెడ్డి, వైస్ ఎంపీపీ వినయ్, డైరెక్టర్లు భరత్ కుమార్, నర్సాగౌడ్, లీడర్బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
భీం పోరాటాలపై సాంగ్ రిలీజ్
ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం చేసిన పోరాటాలను తెలియజేసేలా కలెక్టర్ రాహుల్ రాజ్ రచించిన సాంగ్ సీడీని తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యులు స్వరపరచగా రాష్ట్ర మంత్రి ఐకే రెడ్డి జోడేఘాట్ లో ఆదివారం ఆవిష్కరించారు. డీపీఆర్వో
కృష్ణమూర్తి ఆధ్వర్యంలో స్వరకల్పన చేసినట్లు సాంస్కృతిక సారథి సభ్యులు వివరించారు. అనంతరం పద్మశ్రీ కనకరాజును సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ , మాజీ ఎంపీ గేడం నగేశ్, జడ్పీటీసీ నాగేశ్వరరావు, ఎస్పీ సురేష్ కుమార్, డీఎఫ్‌వో దినేష్ కుమార్, ఐటీడీఏ చైర్మన్ లక్కీరావు, ఎంపీపీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
‘మునుగోడు’లో బీజేపీ లీడర్లు
నిర్మల్, వెలుగు: మునుగోడు బైఎలక్షన్ ప్రచారంలో ఆదివారం నిర్మల్ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు పాల్గొన్నారు. బై ఎలక్షన్ స్టీరింగ్‌కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ వివేక్‌వెంకటస్వామితో కలిసి మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, బీజేపీ పెద్దపల్లి ఇన్చార్జి రావుల రాంనాథ్, సీనియర్ నాయకులు సతీశ్వర్‌రావు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనుముల శ్రావణ్ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
బుద్ధుడి బోధనలు ఆదర్శం
భైంసా, వెలుగు: ప్రపంచానికి శాంతి, అహింసా మార్గాన్ని బోధించిన బుద్ధుడు అందరికీ ఆదర్శ ప్రాయులని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోస్లే మోహన్ రావు పటేల్ అన్నారు. ఆదివారం భైంసా మండలం బడ్ గామ్ గ్రామంలో గౌతమ బుద్ధుని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ సమాజపు మానవత్వ పరిమళాలు, శాంతి సహనంతో కూడిన అహింసాయుత జీవన విధానం, వీటిలోని మూలాలు బౌద్ధ వారసత్వం నుంచి అలవడ్డాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం లీడర్లు పుట్నాల సాయినాథ్ , మాజీ ఎంపీపీ సుభాశ్జాదవ్, ముత్యం రెడ్డి, మనోజ్ పాల్గొన్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం
నస్పూర్, వెలుగు: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపెల్లి ప్రభాకర్ తెలిపారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేసిన స్టేడియంలో ఈసో ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. టోర్నమెంట్ లో మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీల నుంచి 28టీమ్స్ పాల్గొన్నాయి. కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్, శ్రీధర్, లీడర్లు వెంకటస్వామి, రాజేందర్, రమేశ్ పాల్గొన్నారు.
కార్మికవాడల్లో సీపీఐ బైక్ ర్యాలీ
మందమర్రి,వెలుగు: మందమర్రి పట్టణంలోని సింగరేణి కార్మికవాడల్లో సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని సీపీఐ జాతీయ సమితి మెంబర్ కలవేని శంకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ప్రారంభించారు. ఈనెల 14 నుంచి 18 వరకు విజయవాడలో పార్టీ జాతీయ మహాసభలు జరగనున్న నేపథ్యంలో సింగరేణి కార్మికవాడల్లో అవగాహన కల్పించేందుకు మందమర్రి, రామకృష్ణాపూర్ కమిటీల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శనం, శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్లు, ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీలు పాల్గొన్నారు.
సోయా పంటకు నిప్పు
భైంసా (తానూర్), వెలుగు: నిర్మల్ జిల్లా తానూర్ మండలం చిట్టెవాడ మారుతి అనే రైతుకు చెందిన సోయా పంటకు గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. 2.20 ఎకరాల్లో సాగు చేసిన సోయా పంటను ఇటీవల కోసి కుప్ప చేసి ఆరబెట్టాడు. శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు కుప్పకు నిప్పటించగా.. కాలిబూడిదైంది. సుమారు 20 క్వింటాళ్ల సోయా కాలిపోగా.. రూ. లక్ష వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపారు. పీఎస్‌లో ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సింగరేణి ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి
మందమర్రి,వెలుగు: మందమర్రి ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఆదివారం మహర్షి వాల్మీకి జయంతిని నిర్వహించారు. జీఎం ఆఫీస్‌లో ఏరియా జీఎం శ్రీనివాస్ వాల్మీకి ఫొటోకు పూలమాలవేశారు. మందమర్రి మున్సిపాలిటీ ఆఫీస్‌లో కమిషనర్ గద్దె రాజు ఆధ్వర్యంలో వాల్మీకి జయంతిని నిర్వహించారు.
నిర్మల్, ఆదిలాబాద్, వెలుగు: నిర్మల్, ఆదిలాబాద్జిల్లాకేంద్రాల్లో ఆదివారం వాల్మీకి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. నిర్మల్ కలెక్టరేట్లో వాల్మీకి ఫొటోకు అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆదిలాబాద్‌లోని బీసీ స్టడీ సర్కిల్ ఆఫీస్‌లో బీసీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ వాల్మీకి ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్డీవో రమేశ్ రాథోడ్, సీడబ్ల్యూఓ రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్, బీసీ సంఘం లీడర్లు పాల్గొన్నారు.
గుంతలో పడ్డ ఆర్టీసీ బస్సు
బాసర, వెలుగు: బాసర మండలం బిద్రెల్లి గ్రామం వద్ద ఆదివారం భైంసా నుంచి నిజామాబాద్ కు వెళుతున్న భైంసా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుకు ఓవైపు గుంత ఏర్పడింది. ఆ గుంతలో బస్సు పడిపోవడంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెద్దప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెప్పారు. భైంసా డీఎం అమృత సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
కార్మికవాడల్లో సీపీఐ బైక్ ర్యాలీ
మందమర్రి,వెలుగు: మందమర్రి పట్టణంలోని సింగరేణి కార్మికవాడల్లో సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని సీపీఐ జాతీయ సమితి మెంబర్ కలవేని శంకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ప్రారంభించారు. ఈనెల 14 నుంచి 18 వరకు విజయవాడలో పార్టీ జాతీయ మహాసభలు జరగనున్న నేపథ్యంలో సింగరేణి కార్మికవాడల్లో అవగాహన కల్పించేందుకు మందమర్రి, రామకృష్ణాపూర్ కమిటీల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శనం, శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్లు, ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీలు పాల్గొన్నారు.
ఐసీడీఎస్ ను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు
బెల్లంపల్లి, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయని సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు అబ్బోజు రమణ, దుంపల రంజిత్ అన్నారు. ఆదివారం బెల్లంపల్లిలోని తాపీ సంఘం భవనంలో సీఐటీయూ జిల్లా రెండో మహాసభలు జరిగాయి. జిల్లా అధ్యక్షురాలు ఎస్.సమ్మక్క జెండా ఆవిష్కరణ చేసి సభను ప్రారంభించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశాల సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమైందన్నారు. ఆశాలకు జాబ్ చార్ట్ ఇవ్వడం లేదని, చాలీచాలని జీతాలతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం 24 మందితో కూడిన సీఐటీయు జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సంకె రవి, లీడర్లు రాణి, పుష్పలత పాల్గొన్నారు.
అంబేద్కర్ చూపిన మార్గంలోనే పాలన
లోకేశ్వరం, వెలుగు: డా.బీఆర్ అంబేద్కర్అందరి వాడని, ఆయన చూపిన మార్గంలోనే పాలన వ్యవస్థ నడుస్తోందని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, విగ్రహదాత, ఎంపీటీసీ జయసాగర్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి, ప్రపంచంలో దేశానికి గుర్తింపు రావడానికి అంబేద్కర్రాసిన రాజ్యాంగమే కారణమన్నారు. రాజ్యాంగాన్ని ఏ ఒక్క వర్గానికి అనుకూలంగా కాకుండా, బడుగు, బలహీన వర్గాల పీడిత జాతి అభివృద్ధికి లిఖించారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సౌజన్య, మాజీ జడ్పీ చైర్మన్ శ్యాంసుందర్, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్‌రావు, అంబేద్కర్సంఘ సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
భవానాల ఏర్పాటుతో అభివృద్ధి జరుగదు
ఆసిఫాబాద్ / కాగజ్ నగర్, వెలుగు: ఆదివాసీల అభివృద్ధిపై టీఆర్ఎస్ సర్కార్ మాటలకే పరిమితమైందని, మ్యూజియం, ఆదివాసీ భవనాలతో ఆదివాసీల అభివృద్ధి జరగదని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు మండిపడ్డారు. ఆదివారం జోడేఘాట్ లో కుమ్రంభీం విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రంభీం చేసిన జల్ , జంగల్, జమీన్ పోరాటం.. నేటికీ ఆదివాసీలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మ్యూజియం, ఆదివాసీ భవన్ కట్టించాం అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పడం సిగ్గుచేటన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని గతేడాది కుమ్రం వర్ధంతి సభలో చెప్పిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. ఇప్పటికీ ఆ హామీ ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. గతేడాది చేసిన సర్వేలో ఐటీడీఏ పరిధిలో 40 మంది పోడు రైతులు ఉన్నట్లు నివేదిక వచ్చిందని, మళ్లీ ఇప్పుడు సర్వే ఎందుకని ప్రశ్నించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తామని సీఎం కేసీఆర్చెబుతున్నా అమలులో ఇది ఎలా సాధ్యమో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎవరైనా కోర్టుకు పోతే కొట్టేస్తుందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
ఘనంగా కుమ్రంభీం వర్ధంతి
ఆదివాసీ పోరాట యోధుడు కుమ్రంభీం వర్ధంతిని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మండలాలు, గ్రామాల్లో ఆదివాసీ సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, లీడర్లు పాల్గొని భీం విగ్రహాలు, ఫొటోలకు నివాళులర్పించారు.
- నెట్వర్క్, వెలుగు
అంబేద్కర్ చూపిన మార్గంలోనే పాలన
లోకేశ్వరం, వెలుగు: డా.బీఆర్ అంబేద్కర్అందరి వాడని, ఆయన చూపిన మార్గంలోనే పాలన వ్యవస్థ నడుస్తోందని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, విగ్రహదాత, ఎంపీటీసీ జయసాగర్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి, ప్రపంచంలో దేశానికి గుర్తింపు రావడానికి అంబేద్కర్రాసిన రాజ్యాంగమే కారణమన్నారు. రాజ్యాంగాన్ని ఏ ఒక్క వర్గానికి అనుకూలంగా కాకుండా, బడుగు, బలహీన వర్గాల పీడిత జాతి అభివృద్ధికి లిఖించారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సౌజన్య, మాజీ జడ్పీ చైర్మన్ శ్యాంసుందర్, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్‌రావు, అంబేద్కర్సంఘ సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకే ధర్నా
ఆదిలాబాద్, వెలుగు: టీఆర్ఎస్ పై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఎమ్మెల్యే జోగు రామన్న కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మండిపడ్డారు. ఆదివారం పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన అనుభవం ఉన్న జోగు రామన్న కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. జిల్లాలో అనేక సమస్యలు ఉండగా.. ప్రజలను మభ్యపెట్టేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే ధర్నా చేయడం సరికాదన్నారు. హాస్పిటళ్లలో డాక్టర్ల నియామకం, ఎయిర్ పోర్ట్, డబుల్బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి కోసం ధర్నా చేయాలని సూచించారు. సీసీఐని రాష్ట్రానికి అప్పగించడానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎంఓయూ ఒప్పందం కోసం చర్చలకు పిలిస్తే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు దినేశ్ మటోలియ, లోకా ప్రవీణ్ రెడ్డి, ఆకుల ప్రవీణ్, స్వామి రెడ్డి, ముకుంద్ రావు, నగేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
500 మంది పోలీసులతో బందోబస్తు
కాగజ్ నగర్ ,వెలుగు: కెరిమెరి మండలం జోడేఘాట్ లో నిర్వహించిన కుమ్రం భీం వర్ధంతికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మన రాష్ట్రంతోపాటు, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 12 వేల మంది జోడేఘాట్ కు తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎస్పీ సురేశ్‌కుమార్ ఆధ్వర్యంలో మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ (అడ్మిన్) అచ్చేశ్వర్ రావు, అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డీఎస్పీలు శ్రీనివాస్ , నాగేందర్ బందోబస్తు పర్యవేక్షించారు.12 మంది సీఐలు 27 మంది ఎస్సైలతో కలిసి మొత్తంగా 500 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.