-has-ordered-an-inquiry-into-the-activities-of-Jomato-and-Swiggy_zP3WtZnuYm.jpg)
దర్యాప్తు చేయాలని సీసీఐ ఆదేశాలు
న్యూఢిల్లీ: జొమాటో, స్విగ్గీ కార్యకలాపాలపై దర్యాప్తు జరపాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశించింది. పేమెంట్లలో ఆలస్యం, ఎక్కువ కమీషన్ వసూలు చేయడం సహా పలు ఆరోపణలు ఈ ఫుడ్ యాగ్రిగేటర్లపై వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని సోమవారం నాటి ఆర్డరులో సీసీఐ పేర్కొంది. దర్యాప్తు చేసి, రెండు నెలల లోపు రిపోర్టు సబ్మిట్ చేయాల్సిందిగా డైరెక్టర్జనరల్ను సీసీఐ ఆదేశించింది. దేశవ్యాప్తంగా 50 వేల మంది మెంబర్లున్న నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ఫైల్ చేసిన కంప్లయింట్‌పై సీసీఐ పై ఆదేశాలు జారీ చేసింది. కిందటేడాది జులైలో ఎన్ఆర్ఏఐ ఈ కంప్లయింట్‌ను ఫైల్ చేసిన విషయం తెలిసిందే. తమ దగ్గర నుంచి చాలా ఎక్కువ కమీషన్‌ను జొమాటో, స్విగ్గీలు వసూలు చేస్తున్నాయనేది ఎన్ఆర్ఏఐ ప్రధాన ఆరోపణ.