ఒరిజినల్  ఆధార్ కార్డు లేదని..యువతిని మధ్యలో దించేసిన కండక్టర్

ఒరిజినల్  ఆధార్ కార్డు లేదని..యువతిని మధ్యలో దించేసిన కండక్టర్

వేములవాడ, వెలుగు : ఒరిజినల్  ఆధార్  కార్డు లేదని ఆర్టీసీ బస్సులో నుంచి యువతిని కండక్టర్  మధ్యలోనే దించేశారు. తిప్పాపూర్  పట్టణానికి చెందిన జస్విని వేములవాడలో హైదరాబాద్​ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కింది. 3 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత కండక్టర్  చెకింగ్  చేశాడు. ఆమె తన ఆధార్  కార్డు కలర్​ జిరాక్స్  చూపించింది. ఇందుకు తమ రూల్స్​ ఒప్పుకోవని, ఒరిజినల్  కార్డు చూపాలని చెప్పి కండక్టర్  ఆమెను నంది కమాన్​  వద్ద ప్రాంతంలో దించారు.

దీంతో ఆ యువతి తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు డిపో మేనేజర్​తో వాగ్వాదానికి దిగారు. మధ్యలో ఎలా దింపుతారని సదరు కండక్టర్​పై ఫిర్యాదు చేశారు. ఆమె కలర్  జిరాక్స్  చూపినందుకు దింపేశారని మేనేజర్  తెలిపారు. బస్సులో ప్రయాణించే మహిళలు ఒరిజినల్  ఆధార్  కార్డు చూపించాలని ఆయన పేర్కొన్నారు.