దగ్గుతున్న వారికి 6 ఫీట్ల దూరం ఉండాలి

దగ్గుతున్న వారికి 6 ఫీట్ల దూరం ఉండాలి

అట్లొస్తే.. ఇట్లాపుదం
కరోనా రాకుండా పైలంగ ఉందం 
తుమ్మినంత మాత్రాన కొవిడ్‌ కాదు

రోజురోజుకు విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రపంచమంతా ప్రయత్నాలు మొదలుపెట్టింది. చాలా వరకు దేశాలు తమ బోర్డర్లను మూసేసుకుంటున్నాయి. వేరు దేశం నుంచి వచ్చే తమ వాళ్లను పర్‌‌ఫెక్ట్‌‌గా చెక్‌‌ చేశాకే అనుమతిస్తున్నాయి. విదేశీయులు రావొద్దని చెప్పేశాయి. పబ్లిక్‌‌ ఈవెంట్లను, జనం గుమికూడే ప్రదేశాలను మూసేశాయి. మనదేశంలోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించింది. మహమ్మారిని ఆపే పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్‌‌ వచ్చిన వాళ్లలో చాలా మంది బయటి నుంచి వచ్చినోళ్లే. మన దగ్గర కరోనా సోకిన కేసులు చాలా తక్కువ. అంటే ఈ మహమ్మారి ఇండియాలో స్టేజ్‌‌ 2లోనే ఉంది. దీంతో రోగాన్ని ఈ స్టేజ్‌‌లోనే అడ్డుకోవడానికి కేంద్రం వేగం పెంచింది.

మనమెలా సేఫ్‌గా ఉండాలి?

దగ్గుతున్న వారికి 6 ఫీట్ల దూరం ఉండాలి.
ఎందుకంటే వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు
తుంపర్ల ద్వారా వైరస్‌ బయటకొచ్చి
పక్కన, ఎదురున్న వాళ్ల ముక్కు,
నోటిపై పడే చాన్స్‌ ఉంది.
మీ కండ్లు, ముక్కు, నోటిని చేతితో తాకొద్దు.
దగ్గేటప్పుడు టిష్యూ పేపర్‌నో,
కర్చిఫ్‌నో అడ్డం పెట్టుకోండి.

ఎక్కువగా వాడే వస్తువులను.. అంటే లిఫ్ట్‌ బటన్లు,
డోర్‌ హ్యాండిల్‌, రెస్టారెంట్‌ టేబుల్స్‌
లాంటి వాటిని ఎప్పటికప్పుడు క్లీన్‌ చేయండి.

మీ చేతులను ఎప్పటికప్పుడు సబ్బు,
నీటితో 20 సెకన్ల పాటు కడుక్కోండి.
ఆల్కహాల్‌ ఉన్న శానిటైజర్లను వాడండి
చేతులు సక్కగ కడుక్కోవాలె
కడుక్కునేటపప్పుడు ఎక్కువగా మిస్‌ అయ్యే ప్రాంతం
అప్పుడప్పుడు మిస్‌ అయ్యే ప్రాంతం
సాధారణంగా కడుక్కునే ప్రాంతం

ఏ స్జేజ్‌లో వైరస్ ఎట్ల విజృంభిస్తది?

స్టేజ్‌ 1

వైరస్‌ ప్రభావమున్న దేశాల నుంచి మన దేశానికి సోకడం.

స్టేజ్‌ 2

పాజిటివ్‌ వ్యక్తుల నుంచి స్థానికంగా మెల్లమెల్లగా సోకుతుండటం. ఈ టైంలో బయటి నుంచి వచ్చిన వాళ్లతో సన్నిహితంగా మెలిగిన వారికి వ్యాధి వస్తుంది.

స్టేజ్‌ 3

వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. పాజిటివ్‌ వ్యక్తితో డైరెక్ట్‌ కాంటాక్ట్‌ లేకున్నా వ్యాపిస్తుంటుంది.

స్టేజ్‌ 4

ఎండ్‌ పాయింట్‌ అనేది లేకుండా దేశమంతా రోగం విజృంభిస్తుంది. ప్రస్తుతం ఇటలీ ఈ స్టేజ్‌లోనే ఉంది.

వైరస్‌ ఎట్ల వ్యాపిస్తది?

మిగతా వైరస్‌లతో పోల్చితే కరోనా బరువెక్కువ. కాబట్టి మూడు ఫీట్లకు మించి దూరం పోలేదు.
కొవిడ్‌ వ్యాధి చివరి స్టేజ్‌లో ఉన్న వ్యక్తి నుంచి వైరస్‌ ఎక్కువగా వ్యాపిస్తుందని జనం అనుకుంటరు.
కానీ అసలు వ్యాధి లక్షణాలు కనబడని వాళ్ల నుంచి కూడా వ్యాపించే చాన్స్‌ ఉంది.
వైరస్‌ ఉన్న వస్తువులను తాకి తర్వాత కండ్లు, ముక్కు, మూతిని టచ్‌ చేస్తే ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఎక్కువ.