హెచ్‌‌‌‌ఐవీ సోకిన మహిళలో 32 సార్లు కరోనా వైరస్‌‌‌‌

హెచ్‌‌‌‌ఐవీ సోకిన మహిళలో 32 సార్లు కరోనా వైరస్‌‌‌‌

గత 2 నెలల్లో అతి తక్కువ కేసులు
15 లక్షల కంటే దిగువకు యాక్టివ్ కేసులు
 93.67 శాతానికి పెరిగిన రికవరీ రేటు

న్యూఢిల్లీ:హెచ్‌‌‌‌ఐవీ సోకిన ఓ మహిళ కరోనా బారిన పడి 216 రోజులు ఆ వైరస్‌‌‌‌తో ఇబ్బంది పడింది. ఆమె శరీరంలోని కరోనా వైరస్‌‌‌‌ 32 సార్లు మార్పు చెందింది. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ కేసు రీసెర్చ్‌‌‌‌ వివరాలను ఇటీవల మెడ్‌‌‌‌ రిక్సివ్‌‌‌‌ జర్నల్‌‌‌‌లో పబ్లిష్‌‌‌‌ చేశారు. ఆ రిపోర్టు ప్రకారం.. సదరు మహిళ 2006లో హెచ్‌‌‌‌ఐవీ బారిన పడ్డారు. హెచ్ఐవీ కారణంగా ఆమె రోగ నిరోధక వ్యవస్థ క్రమంగా బలహీనపడింది. ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్‌‌‌‌లో ఆమెకు కరోనా సోకింది. ఆ తర్వాత 216 రోజులు ఆ మహిళ శరీరంలో కరోనా 32 మార్పులకు లోనైంది. స్పైక్ ప్రోటీన్‌‌‌‌లో 13 మార్పులు జరగ్గా.. 19 ఇతర రకాల జన్యు మార్పులు జరిగాయి. ఇప్పుడు కొత్తగా గుర్తించిన కరోనా వేరియంట్ల- జన్యు మార్పులను పోలినవి ఆ మహిళ శరీరంలోని వైరస్‌‌‌‌ మ్యుటేషన్లలో గుర్తించామని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే ఆమె నుంచి వేరే వాళ్లకు కరోనా వ్యాపించిందా లేదా అనే విషయంలో స్పష్టత రాలేదన్నారు. 
కేసులు మరిన్ని బయటపడితే..
హెచ్‌‌‌‌ఐవీ సోకిన మహిళలో కరోనా మ్యుటేషన్లు అనుకోకుండా తెలుసుకున్నదేంకాదని సైంటిస్టులు చెప్పారు. హెచ్‌‌‌‌ఐవీ రోగులు ఎక్కువుండే దక్షిణ ఆఫ్రికాలోని క్వాజులు నటాల్‌‌‌‌ ప్రాంతంలో కరోనా కొత్త వేరియంట్లను గుర్తించామన్నారు. హెచ్‌‌‌‌ఐవీ బాధితులకు కరోనా ముప్పు ఎక్కువనేందుకు అధారాల్లేవని, ఇలాంటి కేసులు మరిన్ని బయటపడితే మాత్రం.. హెచ్‌‌‌‌ఐవీ ముదిరిపోయిన రోగులు కరోనా వేరియంట్లను ఉత్పత్తిచేసే ఫ్యాక్టరీలుగా మారతారని హెచ్చరిస్తున్నారు. 
రోగనిరోధక శక్తి తక్కువున్న వారిలో..
రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారిలో కరోనా ఎక్కువ కాలం ఉంటుందని సైంటిస్టులు చెప్పారు. ఈ మహిళలో కరోనా సోకిన తొలి నాళ్లలో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉంది.. కానీ ఆమె శరీరంలో వైరస్ ఎక్కువకాలం ఉందన్నారు. హెచ్‌‌‌‌ఐవీ ఉన్నట్టు తెలియని వారిని గుర్తించి చికిత్స ప్రారంభించాలని, దీనివల్ల వాళ్లలో కొత్త కరోనా వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం తగ్గుతుందని ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. అలా చేస్తే కొత్త వేవ్‌‌‌‌ల ప్రమాదం కొంత తగ్గుతుందన్నారు. హెచ్‌‌‌‌ఐవీ రోగులు ఎక్కువున్న ఇండియాలో ఇది ఆందోళనకరమైన అంశమేనన్నారు.
వ్యాక్సినేషన్‌‌‌‌లో ప్రెగ్నెంట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి
కరోనాతో చనిపోతున్న గర్భిణుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. వారికి వ్యాక్సినేషన్​లో ప్రాధాన్యం ఇవ్వాలని కొందరు డాక్టర్ల బృందం సూచించింది. ప్రెగ్నెంట్లను హై ప్రయారిటీ గ్రూప్​లో చేర్చాలని కోరింది. ఈ మేరకు ఢిల్లీకి చెందిన వర్ధమాన మహావీర్ మెడికల్ కాలేజ్, సఫ్దార్ జంగ్ హాస్పిటల్ డాక్టర్స్ టీమ్ రిపోర్ట్ తయారుచేసింది. ఈ గ్రూప్ కు యామిని సర్వల్ నేతృత్వం వహించా రు. ఇప్పుడు గర్భిణులకు టీకాలు వేయట్లేద ని వీళ్ళు చెప్పారు.  "కరోనా టీకా సేఫ్టీ, ఎఫికసీపై రుజువులు వెలువడుతున్నా యి. అప్పుడే పుట్టిన శిశువుకూ టీకా రక్షణ కల్పిస్తోంది. మామూలు స్త్రీలకన్న గర్భిణులకు కరోనా కాంప్లికేషన్స్ ఎక్కువ. అందుకే వారిని హై రిస్క్ గ్రూప్​లో చేర్చాలి" అని సూచించింది.