ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ మానవ చర్మంపై 9 గంటలపాటు సజీవంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ విషయాన్ని క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో జపాన్ పరిశోధకులు ప్రచురించారు. అందుకే కరోనాను కంట్రోల్ చేయడానికి తరచుగా చేతులు కడుక్కోవాలని వారు సూచించారు.
‘మానవ చర్మంపై కోవిడ్ వైరస్ తొమ్మిది గంటల పాటు తన మనుగడ సాగిస్తుంది. దాంతో వైరస్ కాంటాక్ట్ ట్రాన్స్మిషన్ పెరిగే ప్రమాదముంది’ అని జర్నల్ ద్వారా శాస్తవేత్తలు తెలియజేశారు. కరోనాతో మరణించిన వ్యక్తి చర్మాన్ని ఒక రోజు తర్వాత సేకరించి పరీక్షిస్తే.. వైరస్ యాక్టివ్‌గా ఉన్నట్లు వారు తెలిపారు. లోహాలు, గ్లాస్, ప్లాస్టిక్ వంటి వాటి మీద వైరస్ 9 రోజుల వరకు బతకగలదని పరిశోధకులు తెలిపారు. తక్కువ ఉష్ణోగ్రతల్లో ఈ వైరస్ 28 రోజుల వరకూ సజీవంగా ఉంటుందని గుర్తించారు.
శానిటైజర్లలో వాడే ఇథనాల్‌ను ఉపయోగించడం వల్ల కరోనావైరస్ మరియు ఫ్లూ వైరస్‌లను 15 సెకన్లలో నాశనం చేయవచ్చు. ఈ అధ్యయనాన్ని దృష్టిలో ఉంచుకొని.. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది.
For More News..
