చాలా రోజుల తర్వాత పెరిగిన ఫారెక్స్ నిల్వలు

చాలా రోజుల తర్వాత పెరిగిన  ఫారెక్స్ నిల్వలు
  • అక్టోబర్ 28 తో ముగిసిన వారంలో  531.081 బిలియన్ డాలర్లకు..

న్యూఢిల్లీ: దేశ ఫారెక్స్ నిల్వలు చాలా రోజుల తర్వాత తిరిగి పెరిగాయి. కిందటి నెల 28 తో ముగిసిన వారంలో దేశ ఫారెక్స్ నిల్వలు 6.51 బిలియన్ డాలర్లు పెరిగి 531.081 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఏడాది కాలంలో ఒక వారంలో ఇంతలా ఫారెక్స్ నిల్వలు పెరగడం ఇదే మొదటిసారి. ఆర్‌‌బీఐ డేటా ప్రకారం, గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫారెన్ కరెన్సీ వంటి అన్ని విభాగాల్లోనూ పెరుగుదల కనిపించింది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21 తో ముగిసిన వారంలో  దేశ ఫారెక్స్ రిజర్వ్‌‌‌‌‌‌‌‌లు 524.52 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి పతనాన్ని కంట్రోల్ చేసేందుకు ఈ ఏడాది ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ  సుమారు 110 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ రిజర్వ్‌‌‌‌‌‌‌‌లనే  అమ్మింది. ఫలితంగా ఈ ఏడాది దేశ ఫారెక్స్ నిల్వలు 16 శాతం తగ్గాయి. మరోవైపు యూఎస్ డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాల్యూ విపరీతంగా పెరగడంతో కూడా దేశ ఫారెక్స్‌‌‌‌‌‌‌‌ నిల్వలు తగ్గాయి. కిందటి నెల 28 తో ముగిసిన వారంలో  దేశ ఫారెన్ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఏ)  5.772 బిలియన్ డాలర్లు పెరిగి 470.847 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అదే 21 తో ముగిసిన వారంలో వీటి విలువ 465.075 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు దేశ గోల్డ్ నిల్వలు కూడా పుంజుకున్నాయి. గోల్డ్‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌లు  తాజా వారంలో 556 మిలియన్ డాలర్లు పెరిగి 37.762 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. స్పెషల్ డ్రాయింగ్‌‌‌‌‌‌‌‌ రైట్స్‌‌‌‌‌‌‌‌ (ఎస్‌‌‌‌‌‌‌‌డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)  విలువ అక్టోబర్ 28 తో ముగిసిన వారంలో 185 మిలియన్ డాలర్లు ఎగిసి 17.625 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌‌‌‌‌‌‌‌ (ఐఎంఎఫ్‌‌‌‌‌‌‌‌) దగ్గర ఉన్న దేశ రిజర్వ్ పొజిషన్‌‌‌‌‌‌‌‌  48 మిలియన్ డాలర్లు పెరిగి 4.87 బిలియన్ డాలర్లకు పెరిగింది. కాగా, కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దేశ ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్ల దగ్గర ఆల్ టైమ్ హైని టచ్ చేశాయి. ఫారెక్స్ నిల్వలు పెరగడంతో   డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం   53 పైసలు పెరిగి 82.35 వద్ద  ముగిసింది.  చైనీస్ యువాన్, యూరో, పౌండ్‌‌‌‌‌‌‌‌ కరెన్సీలు  శుక్రవారం  డాలర్ మారకంలో పెరగడంతో  దేశ రూపాయికి సపోర్ట్ లభించింది.

ఈ నెలలో రూపాయి పెద్దగా కదలదు..

యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, ఇతర గ్లోబల్ అంశాల కారణంగా డాలర్ వాల్యూ విపరీతంగా పెరుగుతోంది.  మరోవైపు యూరో మారకంలో రూపాయి విలువ  ఈ ఏడాది ప్రారంభంలో 88 గా ఉండగా, ప్రస్తుతం 80 కి మెరుగుపడింది. అదే బ్రిటన్ పౌండ్ మారకంలో 102 గా ఉన్న రూపాయి విలువ ప్రస్తుతం 92.60 కి బలపడింది. జపనీస్ యెన్ మారకంలో 66 పైసాల నుంచి 55 పైసాలకు మెరుగుపడింది. ‘ఈ నెలలో డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–రూపాయి  ఒక రేంజ్‌‌‌‌‌‌‌‌లోనే కదులుతుందని అంచనావేస్తున్నాం. చాలా వరకు నెగెటివ్ వార్తలు, ఫెడ్ హాకిష్‌‌‌‌‌‌‌‌ (కఠినమైన మానిటరీ పాలసీ) వైఖరికి ఇప్పటికే రూపాయి కదిలింది. డాలర్ మారకంలో రూపాయి విలువ  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పెట్టుకున్న కంఫర్ట్ జోన్‌‌‌‌‌‌‌‌ను దాటితే అదనంగా  డాలర్లను రిజర్వ్ బ్యాంక్ అమ్మే అవకాశం ఉంది. అంతేకాకుండా కొనడం/అమ్మడాన్ని కొనసాగిస్తూ దేశ కరెన్సీని స్టేబుల్‌‌‌‌‌‌‌‌గా ఉంచడానికి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ప్రయత్నిస్తుంది’ అని  రిలయన్స్ సెక్యూరిటీస్‌‌‌‌‌‌‌‌ ఎనలిస్ట్  శ్రీరామ్ అయ్యర్ పేర్కొన్నారు. ఈ నెలలో డాలర్ మారకంలో రూపాయి 81.25–83.25 బ్యాండ్‌‌‌‌‌‌‌‌లోనే కదలాడొచ్చని ఆయన అంచనావేశారు.