లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సీపీఐ పార్టీ తమ మేనిఫెస్టో విడుదల చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా శనివారం ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను పార్లమెంటు పరిధిలోకి తెస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తామని సీపీఐ మేనిఫెస్టోలో చేర్చింది. ప్రజల స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం, సెక్యులరిజం, ఫెడరలిజం సిద్ధాంతాలను ప్రమోట్ చేసేందుకు సీపీఐ పోరాటం సాగిస్తుందని డి.రాజా తెలిపారు.
కేంద్రం జోక్యానికి తావులేకుండా సమాఖ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు గవర్నర్ కార్యాలయాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌పై సాగిస్తున్న పోరాటాన్ని ఉధృతం చేస్తామని సీపీఐ వాగ్దానం చేసింది. నూతన పౌరసత్వ బిల్లును రద్దు కోసం పనిచేస్తామని సీపీఐ మేనిఫెస్టోలో పేర్కొంది. ఎంజీఎన్ఆర్‌ఈజీఏ కింద కనీస వేతనాల పెంపు, క్యాలెండర్ ఇయర్‌లో వర్కింగ్ డేస్ 200 వరకూ పెంచుతామని, అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధిస్తామని తెలిపింది.