గుట్టలో తగ్గిన భక్తుల రద్దీ.. గంటలోపే నారసింహుడిని దర్శనం

గుట్టలో తగ్గిన భక్తుల రద్దీ.. గంటలోపే నారసింహుడిని దర్శనం

యాదగిరిగుట్ట, వెలుగు: గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ తగ్గింది. హైదరాబాద్‎లో బోనాల పండుగ ప్రభావం గుట్ట ఆలయంపై పడింది. వీకెండ్ వచ్చిందంటే భక్తులతో కిక్కిరిసే ఆలయ పరిసరాల్లో ఆదివారం సందడి కనిపించలేదు. గంటలోపే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. 

రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవిదేవి కుటుంబంతో  స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శనం కల్పించారు. ఆలయంలో నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మొదలై రాత్రి పవళింపుసేవతో ముగిశాయి. ఆదివారం ఆలయానికి రూ.3,31,32,463 ఆదాయం  వచ్చినట్లు అధికారులు తెలిపారు.