న్యూయార్క్‌‌‌‌ టు లాస్‌‌‌‌ ఏంజెలెస్‌‌‌‌..25 సిటీల్లో కర్ఫ్యూ

న్యూయార్క్‌‌‌‌ టు లాస్‌‌‌‌ ఏంజెలెస్‌‌‌‌..25 సిటీల్లో కర్ఫ్యూ

లాస్‌‌‌‌ ఏంజెలెస్‌‌‌‌: ‘ఐ కాంట్‌‌‌‌ బ్రీత్‌‌‌‌’ ఆందోళనలు హింసాత్మకమవడంతో అమెరికా వ్యాప్తంగా 25 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. న్యూయార్క్‌‌‌‌ నుంచి లాస్‌‌‌‌ ఏంజెలెస్‌‌‌‌ వరకు సిటీల్లో పోలీసులను మోహరించారు. 11 నగరాల్లో నేషనల్‌‌‌‌ గార్డ్స్‌‌‌‌నూ రంగంలోకి దింపారు. పోలీసులు నిలువరిస్తున్నా, ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నా ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఉక్కుపాదంతో అణిచేస్తామని ప్రెసిడెంట్‌‌‌‌ ట్రంప్‌‌‌‌ వార్నింగ్‌‌‌‌ ఇచ్చినా, పెద్ద నగరాల్లో కర్ఫ్యూ పెట్టినా ఆదివారం కూడా వేలాదిగా జనం రోడ్లపైకి వచ్చారు. పోలీసుల కార్లకు నిప్పు పెట్టారు. ఇండ్లు, షాపుల కిటికీలు పగలగొట్టారు. ఆందోళనకారులను కంట్రోల్‌‌‌‌ చేయడానికి పోలీసులు టియర్‌‌‌‌ గ్యాస్‌‌‌‌, రబ్బర్‌‌‌‌ బుల్లెట్లను వాడారు.  వాషింగ్టన్‌‌‌‌లో వైట్‌‌‌‌హౌస్‌‌‌‌ బయట ఆందోళనలు జరిగాయి. నిరసనకారులు లోపలికి వస్తే కుక్కలు స్వాగతం పలుకుతాయని ట్రంప్‌‌‌‌ అన్నారు. ‘నో గేమ్స్‌‌‌‌.. పోలీసులను వాళ్ల డ్యూటీ చేసుకోనివ్వాలి’ అని శనివారం ట్వీట్‌‌‌‌ చేశారు.

22 సిటీల్లో 1,669 మంది అరెస్టు

పోలీసుల చేతిలో ఆఫ్రికన్‌‌‌‌ అమెరికన్‌‌‌‌ జార్జ్‌‌‌‌ ఫ్లాయిడ్‌‌‌‌ చనిపోవడంతో మినియాపోలిస్‌‌‌‌లో సోమవారం మొదలైన ఆందోళనలు దేశమంతా పాకాయి. మొదట శాంతియుతంగానే స్టార్టయినా తర్వాత హింసాత్మకమయ్యాయి. 17 సిటీల్లో సుమారు 1,669 మందిని అరెస్టు చేశారు. బయటి వాళ్లే సిటీల్లో అల్లర్లు చేస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. ‘ఆంటిఫా’తో పాటు ఇతర రాడికల్‌‌‌‌ గ్రూప్స్‌‌‌‌ హింసకు దిగుతున్నాయని అధ్యక్షుడు ట్రంప్‌‌‌‌ ఆరోపించారు. ఆందోళనలను డ్రగ్‌‌‌‌ కార్టల్స్‌‌‌‌ అదనుగా వాడుకుంటున్నారని మిన్నెసోటా గవర్నర్‌‌‌‌ టిమ్‌‌‌‌ అన్నారు. సిటీలో రెండ్రోజులుగా అరెస్టయిన వాళ్లంతా బయటి వాళ్లేనని సెయింట్‌‌‌‌ పాల్‌‌‌‌ మేయర్‌‌‌‌ మెల్విన్‌‌‌‌ కార్టర్‌‌‌‌ చెప్పారు.

అడ్డుకోబోతే చితకబాదారు

న్యూయార్క్‌‌‌‌లో ఆందోళన చేస్తున్న ప్రొటెస్టర్లపైకి పోలీస్‌‌‌‌ కారును పోనిచ్చారు. పోలీసులు అలా చేసుండాల్సింది కాదని సిటీ మేయర్‌‌‌‌ బ్లాసియో అన్నారు. అయితే ఆ పరిస్థితిని వాళ్లు తీసుకురాలేదని, ఆందోళనకారులదే తప్పని చెప్పారు. ఇండియానాపొలిస్‌‌‌‌లో శనివారం జరిగిన షూటింగ్‌‌‌‌ ఘటనపై ఇన్వెస్టిగేషన్‌‌‌‌ జరుగుతోంది. ఆ ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. ఫిలదెల్ఫియాలో శాంతియుత నిరసన హింసాత్మకమైంది. 13 మంది అధికారులు గాయపడ్డారు. 4 పోలీస్‌‌‌‌ వెహికల్స్‌‌‌‌ను అంటించారు. లాస్‌‌‌‌ ఏంజెలెస్‌‌‌‌లో ‘బ్లాక్‌‌‌‌ లైవ్స్‌‌‌‌ మ్యాటర్‌‌‌‌’ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. 1992 రాడ్నీ కింగ్‌‌‌‌ అల్లర్ల తర్వాత మళ్లీ ఇప్పుడే నేషనల్‌‌‌‌ గార్డ్‌‌‌‌ను సిటీలో రంగంలోకి దింపారు. డల్లాస్‌‌‌‌లో అల్లరి మూక ఓ స్టోర్‌‌‌‌ను లూటీ చేయడానికి ప్రయత్నించగా ఓ వ్యక్తి కత్తితో అడ్డుకోబోయాడు. వాళ్లు అతన్ని చితకబాదారు.

లాక్ డౌన్ 4.0 లోనే సగం కరోనా కేసులు