ఆశ్రయం ఇచ్చినోళ్లను వదిలి రానంటున్న మెడికల్ విద్యార్థిని

ఆశ్రయం ఇచ్చినోళ్లను వదిలి రానంటున్న మెడికల్ విద్యార్థిని

మెడిసిన్​ చదవడానికి ఉక్రెయిన్​ వెళ్లిన ఓ స్టూడెంట్​అక్కడ తనకు ఆశ్రయమిచ్చి న కుటుంబాన్ని వదిలిరావడానికి ఇప్పుడు ఇష్టపడడంలేదు. అక్కడే ఉంటే ప్రాణాలు పోవచ్చని తెలిసీ రానంటుందా అమ్మాయి. ఇంటి ఓనర్​ వాలంటరీగా సైన్యంలో చేరితే.. ముగ్గురు పిల్లలతో ఆయన భార్య ఏమైపోతుందోనని టెన్షన్​ పడుతోంది. హర్యానాకు చెందిన ఆ స్టూడెంట్​ పేరు నేహ. ఆమె తండ్రి ఇండియన్​ ఆర్మీకి సేవలందిస్తూ ఇటీవలే కన్నుమూశారు. మెడిసిన్​ ఫైనల్​ ఇయర్​ పూర్తి చేయడానికి కిందటేడాదే నేహ ఉక్రెయిన్​ తిరిగివెళ్లింది. హాస్టల్​లో సీటు దొరకకపోవడంతో కీవ్​లో ఓ రూమ్​ రెంట్​కు తీసుకుని ఉంటోంది.ప్రస్తుతం.. ఉక్రెయిన్​ సైన్యానికి మద్ధతుగా ఆమె ఉంటున్న ఇంటి ఓనర్​ కూడా సైన్యంలో చేరిండు. దీంతో ఆయన భార్యా పిల్లల తో కలిసి నేహ అండర్​గ్రౌండ్​ బంకర్​లో ఉంటోంది. పరిస్థితులు చక్కబడేదాకా, ఆ పిల్లల తండ్రి తిరిగొచ్చేదాక ఇండియా కు రాలేనని తన తల్లికి ఫోన్లోచెప్పింది నేహ. బయట బాంబుల మోత వినిపిస్తు న్నా ఇప్పటికైతే తాము క్షేమంగానే ఉన్నామని చెప్పింది.

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్

మూసీ నీటిని దోసిళ్లతో తాగేలా చేస్తాం

మల్లన్న హుండీల్లో నగదు చోరీకి యత్నం