ఏడాదిలోపు డిజిటల్ రూపాయి లాంచ్

ఏడాదిలోపు డిజిటల్ రూపాయి లాంచ్

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఇంకో ఏడాదిలోపు డిజిటల్ రూపాయి లాంచ్ అవుతుంది. డిజిటల్ రూపాయి వస్తే ఏమవుతుందనే ఆలోచన చాలా మందిలో ఉంది. ఒకటి డిజిటల్‌‌‌‌‌‌‌‌ రూపాయి ఆప్షనల్‌‌‌‌‌‌‌‌ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ తెచ్చే ఈ కరెన్సీ వాడకం బాగా పెరిగితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.  ప్రస్తుతం ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ట్రాన్సాక్షన్లు చేస్తే మనీ సెండర్ బ్యాంక్ నుంచి రిసీవర్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌కు చేరుకోవడానికి  ఇంటర్మీడియేట్ సంస్థలు పనిచేయాలి.  బిల్‌‌‌‌‌‌‌‌పే, రేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పే వంటి అనేక పేమెంట్ గేట్‌‌‌‌‌‌‌‌వే సంస్థలు, ఫోన్‌‌‌‌‌‌‌‌పే, పేటీఎం వంటి పేమెంట్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు ఈ ఇంటర్మీడియేట్‌లుగా పనిచేస్తున్నాయి. కార్డుల ద్వారా చేసే ట్రాన్సాక్షన్లలో మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్డ్‌‌‌‌‌‌‌‌, వీసా వంటి కార్డు నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లు కీలకంగా పనిచేస్తున్నాయి. అదే డిజిటల్ రూపాయి వస్తే ట్రాన్సాక్షన్లలో ఇటువంటి ఇంటర్మీడియేట్ సంస్థల అవసరం భారీగా తగ్గుతుందని ఫైనాన్షియల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్టులు అంచనావేస్తున్నారు. 

బ్యాంకుల ఖర్చులు తగ్గుతాయి..

డిజిటల్ రూపాయి వస్తే ముఖ్యంగా కార్డు నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌, పేమెంట్ గేట్‌‌‌‌‌‌‌‌వేల అవసరం భారీగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) కి సంబంధించి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఇంకా ఎటువంటి టెక్నికల్ ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ను గాని, వైట్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కానీ ప్రకటించలేదు. డిజిటల్ రూపాయి వస్తే యూపీఐ సాయంతో  బ్యాంకులే డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా ట్రాన్సాక్షన్లను పూర్తి చేస్తాయి. ఈ ట్రాన్సాక్షన్లకు ఎటువంటి ఇంటర్మీడియేట్స్ అవసరం ఉండదు’ అని డీసీబీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ వైస్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ (డిజిటల్‌‌‌‌‌‌‌‌, ఇన్నొవేషన్‌‌‌‌‌‌‌‌)  ప్రసన్న లోహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. ప్రస్తుతం యూపీఐ ద్వారా జరుగుతున్న డిజిటల్ ట్రాన్సాక్షన్లలో సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ప్రొవైడర్లు, మెయింటెనెన్స్ కాంట్రాక్టర్లు ఇంటర్మీడియేట్ సంస్థలు పనిచేస్తున్న విషయం తెలిసిందే.   అదే డిజిటల్ రూపాయి వస్తే చాలా ఇంటర్మీడియేట్ సంస్థల అవసరం భారీగా తగ్గుతుందని, దీంతో బ్యాంకులకు ఖర్చులు తగ్గుతాయని ప్రసన్నా పేర్కొన్నారు.  అంతేకాకుండా ట్రాన్సాక్షన్లు చాలా ఈజీగా మారుతాయని, సర్వర్ల డౌన్‌‌‌‌‌‌‌‌టైమ్‌‌‌‌‌‌‌‌ చాలా వరకు తగ్గుతుందని అన్నారు. ప్రస్తుతం బ్యాంకులు, పేమెంట్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లు  ట్రాన్సాక్షన్ల కోసం సొంతంగా సిస్టమ్స్‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేసుకున్నాయి.  అదే డిజిటల్ రూపాయి అమల్లోకి వస్తే, ప్రస్తుతం వివిధ ఫైనాన్షియల్ సంస్థలు వాడుతున్న చాలా లెడ్జర్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌లు బ్లాక్‌‌‌‌‌‌‌‌చెయిన్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీతో లింక్ ఉండే సింగిల్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌తో భర్తీ అవుతాయి.

క్రెడిట్ హిస్టరీ కోసం కార్డు నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లు

డిజిటల్ రూపాయి వచ్చినా, కార్డు నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లు, పేమెంట్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ల అవసరం పూర్తిగా పోదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీని లెక్కించడం వంటి అంశాల్లో వీటి అవసరం ఉంటుందని చెబుతున్నారు. మెరుగైన సీబీడీసీని తీసుకురావడంలో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐతో కలిసి పనిచేయడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నామని వీసా ఇండియా కంట్రీ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రామచంద్రన్ పేర్కొన్నారు.  సెక్యూరిటీ, ప్రైవసీ పరంగా, మెరుగ్గా ట్రాన్సాక్షన్లు అవ్వడంలో వివిధ దేశాలు తమ డిజిటల్ కరెన్సీలను డెవలప్ చేసుకోవడంలో వీసా సాయపడుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ అనుభవంతో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐతో పనిచేయడానికి రెడీగా ఉన్నామని చెప్పారు.

కొత్త ఇన్నొవేషన్లకు దారి..

డిజిటల్‌‌‌‌‌‌‌‌గా ఉండే ఫెసిలిటీ తప్ప డిజిటల్ రూపాయి వలన అదనంగా ఎటువంటి బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌ ఉండవని, కానీ, దీని చుట్టూ అనేక సొల్యూషన్లను డెవలప్ చేయొచ్చని  ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎల్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ చీఫ్ ఇన్ఫర్మేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శంకర్సన్‌‌‌‌‌‌‌‌ బెనర్జీ అభిప్రాయపడ్డారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌‌‌‌‌‌‌‌పీసీఐ) వంటి సెంట్రలైజ్డ్ సంస్థల అవసరం లేకపోవడమే  డిజిటల్ రూపాయి వలన వచ్చే మెయిన్‌‌‌‌‌‌‌‌ బెనిఫిట్‌‌‌‌‌‌‌‌ అని ఆయన పేర్కొన్నారు. సెంట్రలైజ్‌‌‌‌‌‌‌‌గా కంట్రోల్‌‌‌‌‌‌‌‌ చేసే ఎటువంటి సంస్థ లేకపోతే, కొత్త కొత్త ఇన్నొవేషన్లను తీసుకురావడానికి  సంస్థలకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు.   

రూపాయికి డిజిటల్ రూపాయికి తేడా..

ఇప్పటికే కార్డులు, వాలెట్లు, యూపీఐ ద్వారా ప్రస్తుతం రూపాయిని డిజిటల్‌‌‌‌‌‌‌‌గానే మనతో తీసుకెళుతున్నాం. కొత్తగా వచ్చే డిజిటల్ రూపాయి ఏవిధంగా డిఫరెంట్ అనే డౌట్‌‌‌‌‌‌‌‌ కొందరికైనా వచ్చి ఉంటుంది. సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్ దగ్గర డిజిటల్ రూపాయితో డిఫరెన్స్ కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  డిజిటల్ కరెన్సీ వలన ట్రాన్సాక్షన్లు వేగంగా జరుగుతాయి. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ లేదా బ్యాంకులు లేదా ఇతర సంస్థలు యూజర్లు, బిజినెస్‌‌‌‌‌‌‌‌ల కోసం ఒక ‘డిజిటల్ అకౌంట్‌‌‌‌‌‌‌‌’ను క్రియేట్ చేయొచ్చని, అంటే సెండర్, రిసీవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ డిజిటల్ అకౌంట్ల ద్వారా మనీని ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. యూజర్లు ఈ డిజిటల్ అకౌంట్ ద్వారా మనీని ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేసుకోవడానికి వీలుంటుంది. మొత్తం డిజిటల్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో జరుగుతుంది. దీంతో భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో ఏటీఎంల అవసరం కూడా తగ్గుతుంది. ట్రాన్సాక్షన్లు వేగంగా జరిగితే ఎకానమీ యాక్టివిటీ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు సైబర్ క్రైమ్స్ వంటి రిస్క్‌‌‌‌‌‌‌‌లు కూడా ఉంటాయని అంటున్నారు. కాగా, డిజిటల్ రూపాయి వాడకం బాగా పెరిగితే ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ కరెన్సీని ప్రింట్ చేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి చేసే ఖర్చు తగ్గుతుంది. 

మరిన్ని వార్తల కోసం

ఈజీడ్రైవ్​ నుంచి టూవీలర్​ లోన్లు

బజాజ్ కంపెనీ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ మృతి