
హైదరాబాద్, వెలుగు : టూవీలర్ల లోన్లు అందించే ఈజీడ్రైవ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హైదరాబాద్ సహా సికింద్రాబాద్, కరీంనగర్, కామారెడ్డి సిటీల్లో ఆఫీసులను శుక్రవారం ప్రారంభించింది. టూవీలర్లకు సంబంధించిన అన్ని రకాల ఫైనాన్షియల్ సర్వీసులను అందిస్తుంది. లోన్లు ఇవ్వడానికి డెక్కన్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో చేతులు కలిపింది. లోన్ కోసం కస్టమర్ ఇన్కమ్ ప్రూఫ్ఇవ్వాల్సిన అవసరం లేదని, పూర్తిగా పేపర్‌లెస్ అగ్రిమెంట్ ప్రాసెస్‌ను అందిస్తామని ప్రకటించింది. అతి తక్కువ వడ్డీరేట్లతో లోన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ–మాండేట్స్, యూపిఐ, వర్చువల్ పేమెంట్స్, ఇతర డిజిటల్ మోడ్‌ల వంటి పద్ధతుల్లో కిస్తీలు కట్టవచ్చు. ఈవీలు సహా అన్ని రకాల టూవీలర్ల కోసం ఈజీడ్రైవ్ ఫైనాన్షియల్ సర్వీసులు అందిస్తుంది. త్వరలో వరంగల్, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మల్కాజిగిరి, మేడ్చల్, గజ్వేల్, వికారాబాద్, ఆర్మూర్‌లో సేవలను అందిస్తామని ఈజీడ్రైవ్ మేనేజింగ్ పార్ట్నర్ తేజ చెప్పారు.