
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో 11 మంది చిన్నారుల మృతికి కారణమైన దగ్గు మందును సూచించిన డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కోల్డ్రిఫ్ దగ్గు మందు తాగిన వారంలోనే చిన్నారులు కిడ్నీ ఫెయిల్ అయి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సిరప్ ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ ప్రవీణ్ సోనీని పరాసియా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు భోపాల్ పోలీసులు ఆదివారం (అక్టోబర్ 05) ప్రకటించారు.
ప్రవీణ్ సోని గవర్నమెంట్ డాక్టర్ అని, చింద్వారాలో అతను నిర్వహిస్తున్న ప్రైవేట్ క్లినిక్‌కు వచ్చిన చిన్నారులకు ఈ సిరప్‌ను సూచించారని ఎస్పీ అజయ్ పాండే తెలిపారు. ప్రస్తుతం పాండేను విచారిస్తున్నట్లు చెప్పారు. సిరప్‌ను తయారుచేస్తున్న తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రీసన్ ఫార్మా యూనిట్‌పైనా మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కంపెనీ తయారు చేసిన దగ్గు మందును తనిఖీ చేయగా అందులో 48.6 % డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని, ఇది అత్యంత
విషపూరితమైనదని అధికారులు పేర్కొన్నారు.