తన యజమాని చనిపోయాడని ఓ పెంపుడు కుక్క తల్లడిల్లిపోయింది. కరీంనగర్ జమ్మికుంట మండలంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. పాపక్కపల్లి గ్రామంలో కౌడగాని లింగయ్య(91) అనే వృద్దుడు ఒ కుక్కను పెంచుకుంటున్నాడు. యజమానిపై ఆ శునకం ఎంతో విశ్వాసం చూసేది. అయితే కొన్ని రోజుల క్రితం లింగయ్య మృతి చెందాడు. యజమాని మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి తీసుకెళ్తుండగా కుక్క కూడా బంధువులతో పాటు అంతిమయాత్రలో పాల్గొంది.
బంధువులతో ఆ శునకం యజమాని పాడె వెంట వెళ్లింది. మృతదేహాన్ని ఖననం చేసేందుకు తవ్విన గొయ్యి చుట్టూ ప్రదక్షణలు చేసిన ఆ శునకం దిగులుతో గొయ్య దగ్గరే కూర్చుంది. లింగయ్య చనిపోయినప్పటి నుంచి దిగులుగా ఉంటుందని బంధువులు చెబుతున్నారు.
