యుద్ధం మళ్లీ భీకరంగా..

యుద్ధం మళ్లీ భీకరంగా..

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ఉధృతం అయ్యాయి.  శాంతి చర్చలకు ఇరాన్ జాప్యం చేస్తుంది.. మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని  ట్రంప్  హెచ్చరించిన  కొన్ని గంటల్లో ఇరాన్ పై అమెరికా రెండో దఫా వైమానిక దాడులకు దిగింది. ప్రతీకారంగా ఇరాన్ కువైట్, బహ్రెయిన్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. పరస్పర దాడులతో అమెరికా, ఇరాన్ మద్య యుద్దం తీవ్ర రూపం దాల్చింది. ఈ దాడులతో ఇప్పటికే బలహీనంగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరింత దెబ్బతీసి మిడిల్ ఈస్ట్ లో  ఘర్షణలను మరింత  పెంచాయి. 

గురువారం   ఇరాన్ పై అమెరికా సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడింది. నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్ వర్క్ లు, వాయు రక్షణ స్థావరాలతో సహా  పలు ఇరాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తరచుగా దాడులు, హార్ముజ్ మార్గంలో అమెరికా బలగాలకు, నౌకయానం జరగకుండా ఇరాన్న అడ్డుపడుతోందని ప్రతిస్పందన గా ఈ దాడులు చేసినట్లుయూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్ కామ్ )  తెలిపింది. ఇరాన్ లోని పలు నిర్దిష్ట సైనిక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేశామని  సెంట్ కామ్ ప్రకటించింది.   

►ALSO READ | ఒమన్ తీరంలో హైటెన్షన్: భారతీయ నావికులతో వెళ్తున్న షిప్‌లపై దాడులు.. వారంలో మూడోసారి

అమెరికా దాడులకు ప్రతిస్పందనగా కువైట్, బహ్రెయిన్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతీకార  దాడులకు దిగింది. కువైట్, బహ్రెయిన్ లో వైమానిక స్థావరాల్లో ఉన్న అమెరికా సైన్యం క్యాంపులపై దాడులు చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్  తెలిపింది. అయితే  ఈ దాడుల్లో  ఎలాంటి ప్రాణ నష్టంగానీ, ఆస్తి నష్టం జరిగినట్లు అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు.  రెండు దేశాల ప్రతీకార దాడులు మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులను మరింత తీవ్రతరం చేశాయి. ఇరాన్, అమెరికా మధ్య యుద్దం మరింత భీకరంగా మారొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే గనక జరిగితే ప్రపంచ దేశాలపై తీవ్రప్రభావం చూపనుంది. 

రెండు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ మరోపక్క దౌత్య పరమైన ప్రయత్నాలు  కొనసాగుతున్నాయి.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  నిన్న చేసిన ప్రకటన కు ముందు త్వరలోనే శాంతి ఒప్పందం కుదరవచ్చని ఆశాభావం వ్యక్తం చేయడం దౌత్య చర్చలు రాబోయే భీకర యుద్దాన్ని నివారించేందుకు కొంత ఛాన్స్ ఉందని చెబుతున్నాయి.