
జడ్చర్ల, వెలుగు: టీఆర్ఎస్ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రాక్టర్ ర్యాలీకి వెళ్తుండగా వెహికల్బోల్తా పడి డ్రైవర్చనిపోయాడు. మహబూబ్నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలం కరివేన రిజర్వాయర్వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొనేందుకు ఊర్కొండ మండలం జగబోయిన్పల్లికి చెందిన ఎర్రోళ్ల రాజు(25) ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో మిడ్జిల్ మండల కేంద్రంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో రాజు స్పాట్లో చనిపోయాడు.