లారీని ఢీకొట్టి ఆటోలో ఇరుక్కుపోయిన డ్రైవర్

లారీని ఢీకొట్టి ఆటోలో ఇరుక్కుపోయిన డ్రైవర్

శుక్రవారం రాత్రి శంషాబాద్ పరిధి రాళ్లగూడ నుంచి హిమాయత్ సాగర్ వైపు వెళ్లే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్​లో ఓ లారీ టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ పక్కకు ఆపాడు. అదే టైమ్​లో శంషాబాద్ నుంచి వస్తున్న ఓ ఆటో డ్రైవర్.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఈ లారీని గమనించకుండా ఓవర్ స్పీడ్​తో వచ్చి ఢీకొట్టాడు. ఆటో ముందుభాగం లారీలోకి వెళ్లడంతో డ్రైవర్ అందులో ఇరుక్కుని తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని సేఫ్​గా బయటికి తీసుకొచ్చి హాస్పిటల్​కు తరలించారు. ఆటో డ్రైవర్ సెల్​ఫోన్​లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న  ఓ డీసీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ డీసీఎంను పక్కకు ఆపి దిగిపోయాడు. క్షణాల్లో వెహికల్ మొత్తం మంటల్లో దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.   – వెలుగు, శంషాబాద్