
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే గేటును గంటన్నర పాటు క్లోజ్చేయడంతో అంబులెన్సులో హాస్పిటల్కు తీసుకెళ్తున్న ఎమర్జెన్సీ పేషెంట్ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఓదెల మండల కేంద్రానికి చెందిన రాజేశం అనే యువకుడు గురువారం అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతన్ని తీసుకుని108లో పెద్దపల్లికి బయలుదేరారు. ఆ టైంలో పెద్దపల్లి – కునారం మధ్య ఉన్న రైల్వే గేట్ పడింది. ఎంతసేపు చూసినా ఓపెన్ చేయలేదు. ఈ క్రమంలో ట్రాఫిక్ భారీగా పెరిగిపోయింది. పేషెంట్ ను వేరే వెహికల్లో తరలించే చాన్స్ లేకుండా పోయింది. యువకుడికి సీరియస్అవ్వడంతో అంబులెన్స్ సిబ్బంది ఆక్సిజన్ పెట్టారు. దాదాపు గంటన్నర తర్వాత గేటు ఓపెన్ చేయడంతో పేషెంటును పెద్దపల్లి సివిల్ హాస్పిటల్కు తరలించారు. రైల్వే గేటు కారణంగా నిత్యం ఇలాంటి సమస్యలు తప్పడం లేదని స్థానికులు చెప్పారు.