దుబాయ్లో ఇంటర్నేషనల్ లీగ్ టీ–20

దుబాయ్లో ఇంటర్నేషనల్ లీగ్ టీ–20

ధనాధన్ క్రికెట్ తో ఎడారి దేశం ఊర్రూతలూగనుంది. సిక్సులు, ఫోర్లు, చీర్ గర్ల్స్తో దుబాయ్ స్టేడియాలు హోరెత్తబోతున్నాయి. ఐపీఎల్ అయిపోయింది.. ఇక టీ–20 వరల్డ్ కప్ అక్కడ జరగదు. మరి ఇంకేం లీగ్ జరగనుందని ఆలోచిస్తున్నారా..! గల్ఫ్లో  ఐపీఎల్ తరహాలో లీగ్ జరగనుంది.   ఇంటర్నేషనల్ లీగ్ టీ–20 పేరుతో జరగనున్న ఈ క్రికెట్ టోర్నీ  ఫస్ట్ ఎడిషన్ వచ్చే ఏడాది  జరగనుంది. ఈ మేరకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 

'ILT20' లీగ్ 2023  జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 మధ్య జరుగుతుంది.  స్థానిక ఆటగాళ్ల ప్రతిభను వెలికితీసేందుకు ఎమిరేట్స్ క్రికెట్‌ బోర్డు లీగ్ ను నిర్వహించనుంది. ఆటగాళ్లలోని టాలెంట్ ను వెలికి తీసి..వారిని ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు ఇంటర్నేషనల్ లీగ్ టీ–20 ఉపయోగపడుతుందని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. లీగ్ లో ఆరు జట్లు పాల్గొంటాయని తెలుస్తోంది. ఈ జట్లకు   మొత్తంగా 34 మ్యాచ్‌లతో షెడ్యూల్‌ రూపొందించారు. ఈ ఆరు ఫ్రాంచైజీలను  రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్‌కతా నైట్ రైడర్స్, కాప్రి గ్లోబల్, GMR, లాన్సర్ క్యాపిటల్, అదానీ స్పోర్ట్స్‌లైన్, బ్రాడ్‌కాస్టర్ ZEE దక్కించుకోబోతున్నట్లు సమాచారం. 

'ILT20' లీగ్ ను ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షేక్ నహయాన్ మబారక్ అల్ నహాయన్, ILT20 చైర్మన్ ఖలీద్ అల్ జరూనీ అన్నారు. ఎక్స్ పీరియన్స్ డ్ కంపెనీలు ఫ్రాంఛైజీ ఓనర్లుగా ఉండడం ఆనందంగా ఉందని చెప్పారు. ఫ్రాంచైజీలకు స్వాగతం పలికిన షేక్ నహయాన్, ఖలీద్ ..
UAE T20 లీగ్‌ ద్వారా వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కు  వినోదం, ఆనందాన్ని అందిస్తామని తెలిపారు.  ఈ టోర్నీ ద్వారా UAE లోని టాలెంటెడ్ క్రికెట్ ప్లేయర్లు వెలుగులోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.