టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ముగిసిన ఈడీ దర్యాప్తు

టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ముగిసిన ఈడీ దర్యాప్తు

టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. చంచల్ గూడ జైల్లో రెండవ రోజు ఈడీ విచారణ ముగిసింది. ఇద్దరు అదనపు డైరెక్టర్లతో కూడిన నలుగురు సభ్యల ఈడీ బృందంతో విచారణ పూర్తి చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. వారి స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు ఈడీ అధికారులు. టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీలో ఎవరు.. ఎప్పుడు..ఎలా జాయిన్ అయ్యారనే వివరాలను సేకరించారు. ప్రవీణ్, రాజశేఖర్ లకు చెందిన బ్యాంక్ అకౌంట్స్ వివరాలను కూడానమోదు చేశారు. ప్రతి నెల ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుంది..? ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయనే కోణంలో అరా తీశారు. 

అకౌంట్లు ఎన్నున్నయ్​... వచ్చే జీతమెంత?

ప్రవీణ్ కు మొత్తం మూడు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ప్రవీణ్ కు చెందిన బ్యాంకు ఖాతాలకు సంబంధించి గత ఐదేళ్ల వివరాల గురించి తెలుసుకున్నారు. ప్రవీణ్, రాజశేఖర్ న్యాయవాదుల సమక్షంలోనే వారి స్టేట్ మెంట్ లపై సంతకాలు తీసుకున్నారు.  కమిషన్ అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ ఇన్ చార్జ్ శంకర లక్ష్మీ స్టేట్ మెంట్ ఆధారంగా రెండవ రోజు ఈడీ అధికారులు ప్రశ్నించారు. కాన్ఫిడెన్షియల్ సిస్టం లాగిన్ వివరాలు ఎలా ఇద్దరికి వచ్చాయనే కోణంలోనూ ప్రశ్నించినట్లు సమాచారం. 

చంచల్ గూడ జైల్ అధికారి గదిలోనే ఈడీ అధికారులు విచారణ పూర్తి చేశారు. ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాల అనంతరం చంచల్ గూడ జైల్ కు వెళ్లి ప్రవీణ్, రాజశేఖర్ ను విచారించారు. దాదాపు 7 గంటల పాటు ఇద్దరిని విచారించారు. ఈ ఇద్దరు ఇచ్చిన సమాచారంతో మరికొంత మందిని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ బోర్డు సభ్యులు, ఇతర అధికారుల వాంగ్మూలం సైతం రికార్డ్ చేయాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ప్రవీణ్, రాజశేఖర్​ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల ఆధారంగా టీఎస్​పీఎస్సీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనార్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సెక్రటరీ అనితారామచంద్రన్​ను కూడా ఈడీ విచారించనున్నట్లు తెలిసింది.

అకౌంట్లు ఎన్నున్నయ్​... వచ్చే జీతమెంత..?

ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిని చంచల్ గూడ జైలులో మొదటి రోజు దాదాపు ఐదు గంటల పాటు ప్రశ్నించి.. వారి స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఈ ఇద్దర్నీ రెండు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దేవేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల ఈడీ టీమ్​.. నిందితుల స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డ్ చేసింది. ఏప్రిల్ 17వ తేదీ ఉదయం11.40 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిందితుల తరఫు అడ్వకేట్ల సమక్షంలో ప్రశ్నించింది. ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజశేఖర్​ను విడివిడిగా విచారించి, వీడియో రికార్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. మనీలాండరింగ్​ కోణంలో వివరాలు రాబట్టింది. మొదటి రోజు విచారణ ముగిసిన అనంతరం 40 నిమిషాల పాటు డ్రాఫ్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి.. నిందితుల సంతకాలను ఈడీ అధికారులు తీసుకున్నారు.