చికోటి ప్రవీణ్ కేసులో తవ్వేకొద్దీ బయటపడుతున్న సంచలన నిజాలు

చికోటి ప్రవీణ్ కేసులో తవ్వేకొద్దీ బయటపడుతున్న సంచలన నిజాలు

క్యాసినో గ్యాంబ్లర్ చికోటి ప్రవీణ్ చుట్టూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఉచ్చు బిగుస్తోంది. సైదాబాద్ IS సదన్ లోని ప్రవీణ్ ఇంటితో పాటు బోయినపల్లిలోని అతడి పార్ట్ నర్ మాధవరెడ్డి ఇంట్లో  కీలక ఆధారాలు సేకరించారు. చికోటి ప్రవీణ్ ల్యాప్ టాప్ లో ప్రముఖుల వివరాలను గుర్తించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన ముగ్గురు మంత్రులతో ప్రవీణ్ కు ఆర్ధిక లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. చికోటి క్యాసినో నెట్ వర్క్ లో 18 మంది ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, 280 మంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 

చెన్నై, బెంగళూర్, హైదరాబాద్ కు చెందిన బంగారం వ్యాపారులకు హవాలా ఏజెంట్ గా ప్రవీణ్ వ్యవహరిస్తున్నాడని సమాచారం. ఇందులో భాగంగానే గోవా, ఇండోనేషియా, నేపాల్ బోర్డర్స్ లోని క్యాసినోలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయని తెలిసింది. గోవా, నేపాల్ లో లీగల్ గానే క్యాసినో బిజినెస్ చేస్తున్నట్లు గుర్తించారు. చికోటి ప్రవీణ్ మొబైల్ ఫోన్ లో వాట్సాప్ గ్రూప్స్ ను పరిశీలించారు. చికోటి ప్రవీణ్ చరిత్ర పెద్దగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే క్యాసినో లీగల్ గానే నిర్వహించినా హవాలా ఏజెంట్ గా పని చేస్తున్నారన్న ఆరోపణలపైనే ఈడీ ప్రధానంగా ఫోకస్ చేసింది. 

క్యాసినోలో హవాలా వ్యాపారం చేస్తున్నారనే సమాచారంతో ప్రవీణ్ కుమార్, మాధవరెడ్డి ఇండ్లు, ఆఫీసులల్లో ఈడీ సోదాలు చేసింది. ఫోన్, ల్యాప్ టాప్, పాస్ పోర్టు స్వాధీనం చేసుకుంది. సోమవారం విచారణకు హాజరు కావాలని ప్రవీణ్ కు నోటీసులు ఇచ్చింది. 

ఫ్లైట్లు, హోటళ్లకు 90 లక్షలు  
ప్రవీణ్ గోవా, నేపాల్‌‌లో లీగల్‌‌గానే క్యాసినో బిజినెస్‌‌ చేస్తున్నట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. ఈవెంట్స్‌‌ కోసం 13 మంది బాలీవుడ్‌‌, టాలీవుడ్‌‌ సెలబ్రెటీలతో ప్రమోషన్‌‌ వీడియోలు చేసినట్లు గుర్తించింది. జూన్‌‌ 10 నుంచి 13 వరకు నిర్వహించిన క్యాసినోలో పాల్గొన్నోళ్ల వివరాలు సేకరిస్తోంది. టూర్ ప్యాకేజీల కింద రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేసినట్లు.. టూర్లకు వచ్చినోళ్ల కోసం రూ.50 లక్షలతో ఫ్లైట్స్, రూ.40 లక్షలతో హోటళ్లు బుక్ చేసినట్లు గుర్తించింది.

లీగల్​గానే చేస్తున్న... 
నాకు గోవా, నేపాల్‌‌లో క్యాసినో ఉంది. లీగల్‌‌గానే వ్యాపారం చేస్తున్నాను. అన్ని పర్మిషన్లు ఉన్నాయి. ఈడీ అధికారులు ఎందుకు సోదాలు చేశారో తెలియదు. సోమవారం విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరవుతాను. 
- చికోటి ప్రవీణ్‌‌ కుమార్‌‌‌‌, క్యాసినో ఆర్గనైజర్‌