ఇబ్రహీంపట్నం చౌరస్తా దగ్గర ఉద్రిక్తత

ఇబ్రహీంపట్నం చౌరస్తా దగ్గర ఉద్రిక్తత

ఇబ్రహీంపట్నం చౌరస్తా వద్ద కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి మృతిచెందిన కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఆదివారం చనిపోయిన మమత కుటుంబ సభ్యులు కూడా ఇబ్రహీంపట్నం చేరుకుని నిరసనకు దిగారు. 

ఈ నెల 25న ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం స్పెషల్ క్యాంపు పెట్టారు. నెలనెలా నిర్వహించే క్యాంపులో భాగంగా డాక్టర్లు 34 మందికి ఆపరేషన్లు చేశారు. అయితే అది వికటించి ముగ్గురు మహిళలు మృతిచెందారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మహిళలు చనిపోయారని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. 

కాగా చనిపోయిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్రూం ఇల్లు, రూ. 4లక్షలు పరిహారం ప్రకటించింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని బాధిత కుటుంబసభ్యులు తిరస్కరించారు. కారణం చెప్పకుండా పరిహారం ప్రకటించడమేంటని.. రోడ్డుపై ఆందోళనకు దిగారు.