The Fantastic Four: మార్వెల్ యూనివర్స్‌‌లో ‘ఫెంటాస్టిక్ ఫోర్’.. తెలుగు ట్రైలర్‌ రిలీజ్

The Fantastic Four: మార్వెల్ యూనివర్స్‌‌లో ‘ఫెంటాస్టిక్ ఫోర్’..  తెలుగు ట్రైలర్‌ రిలీజ్

మార్వెల్ స్టూడియోస్ నుంచి రాబోతోన్న మరో క్రేజీ చిత్రం ‘ఫెంటాస్టిక్ ఫోర్ : ఫస్ట్ స్టెప్స్’. జులై 25న వరల్డ్‌‌వైడ్‌‌గా ఈ సినిమా విడుదల కానుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌‌లో భాగంగా రాబోతోన్న ఈ మూవీ తెలుగు ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. మార్వెల్ కామిక్స్‌‌లోని సూపర్ హీరో కుటుంబానికి, గ్రహాలను మింగేసే గెలాక్టస్‌‌కి మధ్య జరగబోయే భీకర పోరాటాన్ని ఇందులో చూపించారు.

1960ల నాటి రెట్రో-ఫ్యూచరిస్టిక్ సెట్టింగ్‌‌లో ఈ సినిమా ఉంటుందని రివీల్ చేశారు. పెడ్రో పాస్కల్ (రీడ్ రిచర్డ్స్/మిస్టర్ ఫెంటాస్టిక్), వెనెస్సా కిర్బీ (సూ స్ట్రోమ్/ఇన్విజిబుల్ ఉమెన్), జోసెఫ్ క్విన్ (జానీ స్ట్రోమ్/హ్యూమన్ టార్చ్), ఎబోన్ మోస్-బచ్‌‌రాక్ (బెన్ గ్రిమ్/ది థింగ్) ఇంపార్టెంట్ రోల్స్‌‌లో కనిపించారు.

వీళ్ళు గెలాక్టస్ నుంచి భూమిని ఎలా కాపాడారు అనే కథతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌‌ని ట్రైలర్‌‌‌‌లో చూపిన విధానం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇందులోని  విజువల్స్ ఆడియెన్స్‌‌కు మెస్మరైజ్ చేసేలా ఉన్నాయి.  మాట్ షాక్‌‌మాన్ దర్శకత్వంలో కెవిన్ ఫీజ్ నిర్మించారు. ఇంగ్లీష్‌‌తో పాటు తెలుగు,  హిందీ, తమిళ  భాషల్లో ఈ సినిమా  విడుదల కానుంది.