పొలాలు దుక్కి దున్ని.. రెడీగా ఉన్నా..

పొలాలు దుక్కి దున్ని.. రెడీగా ఉన్నా..
  • సమీపిస్తున్న ఖరీఫ్
  • స్పందించని వ్యవసాయ శాఖ
  • అదును దాటితే రైతన్నకు నష్టమే

మహబూబాబాద్, వెలుగు: ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్నా ప్రభుత్వం సబ్సిడీ విత్తనాల ఊసే ఎత్తడం లేదు. ఇప్పటికే చాలా చోట్ల దుక్కులు దున్ని సిద్ధం చేసుకోగా.. విత్తనాల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగ్రోస్ సెంటర్లు, పీఏసీఎస్ సెంటర్ల వద్ద ఎలాంటి విత్తనాలు కనిపించడం లేదు. దీంతో అన్నదాతలు బయటి మార్కెట్​లో డబ్బులు పెట్టి విత్తనాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రెండు రకాలే..
ప్రభుత్వం ఏటా జీలుగ, జనుము విత్తనాలతోనే సరిపెట్టుకుంటోంది. ఖరీఫ్ లో రైతులు పత్తి, వరి, కందులు, పెసర, జొన్నలు, మినుములు, పల్లి, నువ్వులు, పసువు, మొక్కజొన్న వంటి పంటలకు ప్రాధాన్యం 
ఇస్తారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు సైతం ఇవే పంటలను సూచిస్తున్నారు. కానీ సర్కారు మాత్రం ఇవన్నీ పంటలను పక్కన పెట్టి రూ.560లకు 30 కిలోల జీలుగ, జనుము విత్తనాలు మాత్రమే ఇస్తోంది. దీంతో రైతన్నలు బయట ఎమ్మార్పీ రేట్లకు కొని, నష్టపోవాల్సి వస్తోంది. ప్రతి సంవత్సరం తమకు ఇలాగే జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5వేల రైతు బంధు తప్ప సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం లేదని వాపోతున్నారు.
ఎరువులు సైతం..
సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులను సైతం సర్కారు పంపిణీ చేయడం లేదు. అవసరాన్ని బట్టి యూరియా, ఎంఓపీ, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు పంపిణీ చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి తాము ప్రపోజల్స్ పంపించామని, సర్కారు నిర్ణయం మేరకే సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రభుత్వం తీరుతో రైతన్నలకు పెట్టుబడి ఖర్చు పెరిగిపోతోంది.

వానాకాలంలో ఎరువులు     .. కావాల్సిన మోతాదు (మెట్రిక్ టన్నులు)

యూరియా  -   7,71,106
ఎంఓపీ        -      20,784
డీఏపీ          -      24,386
కాంప్లెక్స్     -      53,361

 

ఇవి కూడా చదవండి

గజ్వేల్‌‌లో స్పౌజ్ టీచర్ల ఆవేదన సభ

ప్రతి నెల ఒక రోజు పీహెచ్‌‌సీలోనే నిద్రించాలి