జర్మనీకి జపాన్​ ఝలక్​

జర్మనీకి జపాన్​ ఝలక్​
  •     2‑1తో గెలిచిన ఆసియా టీమ్​
  •     ఆస్ట్రేలియాపై డిఫెండింగ్​ చాంప్​ ఫ్రాన్స్​  ఘన విజయం

దోహా: గల్ఫ్​ గడ్డపై జరుగుతున్న ఫిఫా వరల్డ్​కప్​లో సంచలనాల మోత మోగుతూనే ఉంది. అర్జెంటీనాకు అనామక సౌదీ అరేబియా ఇచ్చిన షాక్​ నుంచి తేరుకునేలోపే ఇప్పుడు మరో మాజీ విజేతకు చుక్కెదురైంది. నాలుగు సార్లు చాంపియన్​, సాకర్​  వరల్డ్​లో టాప్​ టీమ్స్​లో ఒకటైన జర్మనీ అనూహ్య ఓటమితో టోర్నీని ప్రారంభించింది. బుధవారం జరిగిన గ్రూప్-–ఇ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జపాన్‌‌‌‌‌‌‌‌ 2–1తో జర్మనీకి చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టింది. అచ్చం సౌదీ మాదిరిగా అరంభంలో వెనుకబడినా అద్భుతంగా పుంజుకున్న ఆసియా టీమ్‌‌‌‌‌‌‌‌ చివర్లో రెండు గోల్స్‌‌‌‌‌‌‌‌తో మాజీ చాంపియన్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. సబ్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు రిత్సు దోవాన్​ (75వ నిమిషంలో), తకుమా అసనో (83వ నిమిషంలో) చెరో గోల్‌‌‌‌‌‌‌‌తో జపాన్‌‌‌‌‌‌‌‌కు విజయం అందించారు.ఈ ఇద్దరూ జర్మనీకి చెందిన క్లబ్స్‌‌‌‌‌‌‌‌కు ఆడుతున్న ప్లేయర్లు కావడం విశేషం. జర్మన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఇల్కయ్‌‌‌‌‌‌‌‌ గుండొగన్‌‌‌‌‌‌‌‌ (33 నిమిషంలో) ఏకైక గోల్‌‌‌‌‌‌‌‌ చేశాడు. జర్మనీ వరల్డ్​ కప్​ను ఓటమితో ప్రారంభించడంతో ఇది మూడో సారి మాత్రమే. 1982లో అల్జీరియా, 2018లో మెక్సికో చేతిలో పరాజయం పాలైంది. కాగా, గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎఫ్‌‌‌‌‌‌‌‌లో భాగంగా మొరాకో, గత ఎడిషన్​ రన్నరప్​ క్రొయేషియా మధ్య జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌ 0–0తో డ్రా అయింది.

తొలిపోరులోనే జపాన్‌‌‌‌‌‌‌‌ కమాల్‌‌‌‌‌‌‌‌

జర్మనీ, జపాన్‌‌‌‌‌‌‌‌ ఈ ఓ కాంపిటీటివ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పోటీ పడటం ఇదే తొలిసారి. పెద్ద జట్టుతో ఫస్ట్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లోనే జపాన్‌‌‌‌‌‌‌‌ కమాల్‌‌‌‌‌‌‌‌ చేసింది.  ఈ పోరులో ఆరంభం నుంచి జర్మనీ దూకుడు చూపెట్టింది.  ప్రత్యర్థితో పోలిస్తే గోల్‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌పై ఎక్కువ దాడులు చేసింది. బాల్‌‌‌‌‌‌‌‌ను 74 శాతంతమ ఆధీనంలోనే ఉంచుకున్న జర్మన్స్‌‌‌‌‌‌‌‌  ఏకంగా  26 షాట్లు కొట్టారు. అందులో తొమ్మిది టార్గెట్‌‌‌‌‌‌‌‌పై చేశారు. 12 షాట్లు మాత్రమే ఆడిన జపాన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు నాలుగు టార్గెట్‌‌‌‌‌‌‌‌పై కొట్టారు. అందులో రెండు సక్సెస్‌‌‌‌‌‌‌‌ కావడంతో విజయం సాధించారు. వాస్తవానికి 8వ నిమిషంలోనే  జపాన్​ ప్లేయర్​ యమెద బాల్​ను నెట్​లోకి పంపినా.. రిఫరీ దాన్ని ఆఫ్‌‌‌‌‌‌‌‌సైడ్‌‌‌‌‌‌‌‌గా ప్రకటించాడు. ఇక,  జర్మనీకి వచ్చిన ఏకైక గోల్‌‌‌‌‌‌‌‌ కూడా జపాన్‌‌‌‌‌‌‌‌ తప్పిదం వల్లే లభించింది. జపాన్‌‌‌‌‌‌‌‌ గోల్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ షుయిచి గోండ..  నెట్‌‌‌‌‌‌‌‌ దగ్గర ప్రత్యర్థి ప్లేయర్‌‌‌‌‌‌‌‌ను కింద పడేయంతో జర్మనీకి పెనాల్టీ లభించింది.

దీన్ని ఇల్కయ్‌‌‌‌‌‌‌‌ గోల్‌‌‌‌‌‌‌‌గా మలిచాడు. ఫస్టాఫ్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా టైమ్‌‌‌‌‌‌‌‌లో జర్మనీ ప్లేయర్​ హవెర్ట్జ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను నెట్‌‌‌‌‌‌‌‌లోకి పంపినా.. రివ్యూలో  అది ఆఫ్‌‌‌‌‌‌‌‌సైడ్‌‌‌‌‌‌‌‌గా తేలింది. తర్వాతి నిమిషంలోనే ఇల్కయ్‌‌‌‌‌‌‌‌ కొట్టిన షాట్‌‌‌‌‌‌‌‌ గోల్‌‌‌‌‌‌‌‌ బార్‌‌‌‌‌‌‌‌కు తగిలి బయటకు వెళ్లిపోయింది. ఫస్టాఫ్‌‌‌‌‌‌‌‌లో వెనుకబడిన తర్వాత సెకండాఫ్‌‌‌‌‌‌‌‌లో జపాన్‌‌‌‌‌‌‌‌ దూకుడు పెంచింది. ఈ క్రమంలో  జర్మనీ కీపర్‌‌‌‌‌‌‌‌ నయెర్‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌ చేయడంతో రీబౌండ్‌‌‌‌‌‌‌‌ అయిన బాల్‌‌‌‌‌‌‌‌నురిత్సు దోవాన్​  నెట్‌‌‌‌‌‌‌‌లోకి పంపి స్కోరు సమం చేశాడు. ఏడు నిమిషాల తర్వాత లభించిన ఫ్రీకిక్‌‌‌‌‌‌‌‌కు ఇటాకుర నుంచి లాంగ్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌ను అందుకున్న అసనో.. జర్మనీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ష్లోటర్‌‌‌‌‌‌‌‌బెక్‌‌‌‌‌‌‌‌ను దాటుకుంటూ ముందుకెళ్లాడు. బాక్స్‌‌‌‌‌‌‌‌ దగ్గరకు రాగానే  కష్టమైన యాంగిల్‌‌‌‌‌‌‌‌ నుంచి కీపర్‌‌‌‌‌‌‌‌ నుయెర్‌‌‌‌‌‌‌‌ను తప్పిస్తూ బాల్‌‌‌‌‌‌‌‌ను నెట్‌‌‌‌‌‌‌‌లోకి పంపడంతో జపాన్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చింది. ఆ తర్వాత జపాన్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ ప్రత్యర్థికి అడ్డుగోడలా నిలవడంతో జర్మనీకి ఓటమి తప్పలేదు. 

స్పెయిన్​7.. కోస్టారికా 0

మాజీ చాంపియన్​ స్పెయిన్​ ఈ టోర్నీని గోల్స్​ వర్షంతో షురూ చేసింది. గ్రూప్‌–ఇలో తమ తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌ 7–0తో కోస్టారికాను చిత్తు చేసింది. 11వ నిమి షంలో మొదలైన స్పెయిన్‌ ప్లేయర్ల గోల్స్‌ మోత ఎక్స్‌ట్రా టైమ్‌ వరకూ సాగింది. టొరెస్‌  డబుల్‌ గోల్స్‌ కొట్టాడు. ఒమ్లో  , అసెన్సియో,  గవి, సోలెర్‌, మోరాట తలో గోల్‌ రాబట్టారు. కోస్టారికా ఖాతానే తెరువలేకపోయింది. బుధవారం రాత్రి జరిగిన గ్రూప్​ ‌‌–డి మ్యాచ్ లో డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంప్‌‌‌‌‌‌‌‌ ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌ 4–1తో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఒలీవియర్ గిరౌడ్ రెండు గోల్స్​తో సత్తా చాటాడు. రబియోట్, ఎంబపే ఒక్కో గోల్​ చేశారు.