
కిరణ్ అబ్బవరం హీరోగా రమేష్ కాదూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మీటర్’. అతుల్య రవి హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. ఏప్రిల్ 7న సినిమా విడుదల కానుంది.‘చమక్ చమక్ పోరి’ అంటూ సాగే పాటను బుధవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఓ థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య లాంచ్ చేశారు. కిరణ్ మాట్లాడుతూ ‘సాయి కార్తీక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. పెద్ద సెట్‌లో గ్రాండ్‌గా షూటింగ్ చేశాం. పాట చాలా బాగా వచ్చింది. . భాను మాస్టర్ మంచి మాస్ మూమెంట్స్ కంపోజ్ చేశారు. సినిమాలో ఎంటర్‌టైన్మెంట్ మీటర్ ఎక్కడా తగ్గదు. కామెడీ, యాక్షన్, లవ్ అన్నీ ఎలిమెంట్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులు ఊహించినదాని కంటే ఎక్కువ ఎనర్జీ ఇందులో ఉంది’ అన్నాడు. నిర్మాత చెర్రీ మాట్లాడుతూ ‘భాను మాస్ స్టెప్పులు గ్రేస్ ఫుల్‌గా కంపోజ్ చేశారు. అలాగే లిరిక్ రైటర్ బాలాజీ సాంగ్‌కి సరిపడే లిరిక్స్ ఇచ్చారు. రమేష్ చాలా అద్భుతంగా తీశారు. కిరణ్‌ను ఇంతమాస్ అవతార్‌లో చూడటం ఇదే మొదటిసారి. అతుల్య రవి గ్రేస్ ఫుల్‌గా డాన్స్ చేసింది’ అన్నారు. దర్శకుడు రమేష్, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.