
హైదరాబాద్, వెలుగు : ఇటీవల నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ చేసిన ఫైర్ సిబ్బందిని శనివారం ఫైర్ సర్విసెస్ డీజీ నాగిరెడ్డి అభినందించారు. అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న 17 మంది ప్రాణాలు కాపాడిన స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ కె చంద్రశేఖర్, కె.వెంకట నాగేంద్ర, పి. బసంత్, ఫైర్‌మెన్స్ నాగయ్య, పవన్‌రెడ్డి, బీవీఎన్ మూర్తి, ఆర్ ఆదర్ష్, ఎండీ ఇజాజ్, డ్రైవర్ ఆపరేటర్ వినోద్‌కుమార్‌కు క్యాష్ రివార్డు, ప్రశంసా పత్రాన్ని అందించారు.