సెక్రటేరియెట్​లో త్వరలో తొలి మహిళా శక్తి క్యాంటీన్!

సెక్రటేరియెట్​లో త్వరలో  తొలి మహిళా శక్తి క్యాంటీన్!

 హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియెట్ లో మొదటి మహిళా శక్తి క్యాంటీన్ ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఈ నెల 20వ తేదీన దీనిని ప్రారంభించే సూచనలున్నాయి. కుకింగ్, క్యాంటీన్ నిర్వహణలో శిక్షణ పూర్తి చేసుకున్న స్వయం సహాయక మహిళ సంఘాలు ఈ క్యాంటీన్ లను నడపనున్నాయి. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఇటీవల సీఎం ఆదేశాలిచ్చారు. 

దీంతో అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్ లు, పారిశ్రామిక ప్రాంతాలలో మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్ ల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ‘అన్న’ క్యాంటీన్ల పేరుతో కేరళలో, ‘దీదీ కా రసోయ్’ పేరుతో బెంగాల్ లో నడుస్తున్న క్యాంటీన్ ల పని తీరును అధికారులు పరిశీలించారు.