గజ్వేల్కు చేరుకున్న తొలి గూడ్స్ రైలు

గజ్వేల్కు చేరుకున్న తొలి గూడ్స్ రైలు
  • కాకినాడ నుంచి 13 బోగీలలో 1300 మెట్రిక్ టన్నుల ఎరువుల లోడ్ రాక
  • ఎరువుల రేక్‌ పాయింట్‌ను ప్రారంభించిన మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి

సిద్దిపేట జిల్లా: గజ్వేల్ కు తొలి గూడ్స్ రైలు చేరుకుంది. తొలి విడుతగా కాకినాడ నుంచి 13 బోగీలలో 1300 మెట్రిక్ టన్నుల ఎరువుల లోడ్ ను తీసుకుని వచ్చింది. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ లో ఎరువుల రేక్  పాయింట్ ను మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. తొలి విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలోని ఎన్ఎఫ్ సీఎల్ నుంచి గజ్వేల్ కు 12 బోగీల గూడ్సు రైలు 1300 మెట్రిక్  టన్నుల ఎరువుల లోడు తీసుకుని వచ్చింది.  ఈ ఎరువుల రేక్  పాయింట్ కు అనుసంధానంగా సరకు రవాణా జరగనుంది. 
ఎరువుల కోసం 4 వేల మెట్రిక్  టన్నుల సామర్థ్యం కలిగిన రెండు గిడ్డంగులను నిర్మించారు. దీంతో ఇవాళ్టి నుంచి గజ్వేల్ కు గూడ్స్ రైలు రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఎరువుల రేక్‌ పాయింట్‌  ప్రారంభ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, ఎమ్మెల్సీ లు ఫారూఖ్ హుస్సేన్, యాదవరెడ్డి,  కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.