మేజర్‌ సెల్వన్‌ గా గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌

మేజర్‌ సెల్వన్‌ గా గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌

దుల్కర్‌ సల్మాన్, మృణాళినీ ఠాకూర్‌ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం  ‘సీతారామం’. రష్మిక మందన, సుమంత్  కీ రోల్ ప్లే చేస్తున్నారు.   హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న  ఈ సినిమాని  వైజయంతి మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ఫస్ట్ లుక్‌ పోస్టర్లకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా మేకర్స్  డైరెక్టర్‌ గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ కు సంబంధించిన పాత్రను రివీల్‌ చేశారు మేకర్స్.  ఈ సినిమాలో మేజర్‌ సెల్వన్‌ పాత్రలో ఆయన నటిస్తున్నారు. ఈ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 5న విడుదల చేస్తున్నారు. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.