
విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తి, జయం రవి లాంటి స్టార్ కాస్ట్‌తో మణిరత్నం రూపొందిస్తున్న భారీ పీరియాడికల్ ఫ్రాంచైజీ ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగం సెప్టెంబర్ 30న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్‌లో వేగం పెంచిన టీమ్, నిన్న ‘చోళ చోళ’ అంటూ సాగే పాటను హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ ‘మణిరత్నం గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ‘రావణ్’ తర్వాత మళ్లీ ఆయనతో కలిసి వర్క్ చేయడం పెద్ద అదృష్టంగా భావిస్తున్నా’ అన్నాడు. కార్తి మాట్లాడుతూ ‘పొన్నియిన్ సెల్వన్ అనేది 1955లో పబ్లిష్ అయిన నవల. ఇది ఓ సినిమా కాదు.. చరిత్ర. ఇందులో భాగమవడం, గ్రేట్ యాక్టర్స్‌తో కలిసి నటించడం సంతోషం. రాజరాజ చోళుడు మహారాజు కాకముందు జరిగిన కథ. ఇదేమీ ఊహ కాదు. వెయ్యేళ్ల క్రితం జరిగినదే. పాత్రలన్నీ ఒకప్పుడు నిజంగా ఉన్నవే. నది, సముద్రం, అడవుల్లో జరిగే అడ్వెంచరస్ జర్నీ. చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది. ఇలాంటి భారీ సినిమా తీయాలంటే మణిరత్నం, రెహమాన్ లాంటి వాళ్లే కావాలి. కొవిడ్ నిబంధనల మధ్య కేవలం నూట నలభై రోజుల్లో రెండు భాగాల షూట్ పూర్తి చేయడం చిన్న విషయం కాదు’ అన్నాడు.
‘ఈ కథను సినిమాగా తీయాలని ఎంజీర్, కమల్ హాసన్ లాంటి గొప్పవాళ్లంతా ప్రయత్నించారు. కానీ ఆ కథ మణిరత్నం గారి కోసం ఎదురుచూసింది. మా హృదయానికి దగ్గరైన సినిమా ఇది’ అన్నారు నాజర్. మణిరత్నం మాట్లాడుతూ ‘చిరంజీవి గారికి థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్ చెప్పానో త్వరలో తెలుస్తుంది. ఇంత భారీ చిత్రాలు, అది కూడా రెండు భాగాలుగా చేయడానికి ‘బాహుబలి’తో డోర్స్ ఓపెన్ చేసిన రాజమౌళి గారికి థ్యాంక్స్. తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్ రాజు గారికి, తెలుగు డైలాగ్స్ రాసిన భరణి గారికి, నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాని సగర్వంగా మీ ముందుకు తీసుకొస్తున్నాం’ అన్నారు. ‘మణిరత్నం ఈ సినిమాని కష్టపడి కాదు.. ఇష్టపడి తీశారు’ అన్నారు సుహాసిని. తనికెళ్ల భరణి మాట్లాడుతూ ‘ఇరవై ఐదేళ్ల తర్వాత మళ్లీ పెన్ను పట్టి డైలాగ్స్ రాశాను. ‘దళపతి’లో నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. ఇప్పుడు ఆయన సినిమాకి వర్క్ చేయడం లైఫ్‌లో గ్రేటెస్ట్ ఎక్స్‌పీరియెన్స్’ అన్నారు దిల్ రాజు మాట్లాడుతూ ‘మణిరత్నం గారు తీసిన ‘అమృత’ చిత్రంతో నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేసి యాభై సినిమాలు తీశా. మళ్లీ ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్టును రిలీజ్ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్’ అన్నారు. ప్రకాష్ రాజ్, లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.