యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం

యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం

భారతదేశమంతా ఒక్కటేనన్న విధానాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఉత్తరాఖండ్, యూపీలో ప్రచారం నిర్వహించిన ఆయన.... కాంగ్రెస్ తో పాటు సమాజ్ వాదీ పార్టీలపై తీవ్రంగా విమర్శలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కుటుంబస్వామ్యంగా మార్చేశాయని ఆరోపించారు. ప్రపంచమంతా ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల ప్రభుత్వంగా నిర్వచిస్తాయని, కానీ ఈ కుటుంబ పార్టీలు మాత్రం ప్రజాస్వామ్యం అర్థాన్నే మార్చేశాయని అన్నారు. 

తాము దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు మోడీ. అయితే అభివృద్థిపై మాట్లాడలేని ప్రతిపక్షాలు కరోనా వ్యాక్సిన్లపై తప్పుడు ప్రచారం చేశాయని విమర్శించారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థుల్లో ఎక్కువ మందిపై రౌడీ షీట్లు ఉన్నాయని, కొంత మంది అభ్యర్థులు జైలు నుంచి పోటీ చేస్తున్నారని అన్నారు.  కుటుంబ పార్టీల దుర్మార్గపు పాలసీల వల్ల కనౌజ్ లోని పెర్ ఫ్యూమ్ ఇండస్ట్రీ దెబ్బతిందని, తమ ప్రభుత్వం వచ్చాక దానిని దారిలో పెట్టి, కనౌజ్ పెర్ ఫ్యూమ్ ను గ్లోబల్ బ్రాండ్ గా నిలిపే ప్రయత్నం చేస్తున్నామని మోడీ చెప్పారు. యూపీ తొలి దశ ఎన్నికలు జరిగిన తీరు చూస్తే యూపీలో అధికారంలోకి రాబోయేది బీజేపీనే అని తేలిపోయిందన్నారు. 14న రెండో దశ ఓటింగ్ జరిగే రోజున ప్రజలెవరూ కులాల వారీగా ఓట్లను చీల్చొద్దని కోరారు.

మరిన్ని వార్తల కోసం..

మోడీ అధికారంలోకి వచ్చాక మళ్లీ ప్రత్యేక హోదా ఇచ్చినం

అధికారిక లాంఛనాలతో రాహుల్ బజాజ్ అంత్యక్రియలు

పైలట్ లేకుండా ఎగిరిన హెలికాప్టర్