దేశంలోనే ఫస్ట్ ​రోబోటిక్ కన్స్ట్రక్షన్ త్రీడీ ప్రింటర్

దేశంలోనే ఫస్ట్ ​రోబోటిక్ కన్స్ట్రక్షన్ త్రీడీ ప్రింటర్
  • కోటి హోమ్​ ఐసోలేషన్ ​కిట్లు కూడా.. ఒమిక్రాన్​ను ఎదుర్కోవడానికి రెడీ 
  • హెల్త్​ మినిస్టర్​ హరీశ్​రావు

గజ్వేల్, వెలుగు: రాష్ట్రంలో రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు తెలిపారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్​గవర్నమెంట్ ​హాస్పిటల్​ను సడన్​గా విజిట్​ చేశారు. ఈ సందర్భంగా మట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ఏఎన్ఎం, పీహెచ్​సీల్లో కరోనా టెస్టులు చేస్తున్నామన్నారు. హోమ్ ఐసోలేషన్ కిట్లతోనే చాలా వరకు వైరస్​ అంతమవుతోందన్నారు. కొవిడ్​ వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురైతేనే దవాఖానాల్లో చేరాలన్నారు. కరోనాకు ట్రీట్​మెంట్​ఇస్తున్న చాలా దవాఖానాల్లో ఆక్సిజన్ ఫెసిలిటీ కల్పించామన్నారు. అత్యవసరమైతే  ఐసీయూలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, వైరస్​ సోకిన వారు డేంజర్​స్టేజీకి వెళ్లే అవకాశాలు చాలా తక్కువన్నారు. అయినా నిర్లక్ష్యంంగా ఉండవద్దని, కరోనా రూల్స్​ పాటించాలన్నారు. వెంట ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీ చైర్​పర్సన్​ రోజా , మున్సిపల్ ​చైర్మన్​ రాజమౌళి గుప్త, ఏఎంసీ చైర్​పర్సన్​ మాదాసు అన్నపూర్ణ పాల్గొన్నారు. 

ఫస్ట్ ​రోబోటిక్ కన్స్ట్రక్షన్ త్రీడీ ప్రింటర్  ప్రారంభం
దేశంలో మొదటిసారిగా, సౌత్​ ఏషియాలోనే అతిపెద్ద రోబోటిక్ కన్​స్ట్రక్షన్​త్రీడీ ప్రింటర్ ను మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. అర్బన్ మండల పరిధిలోని రామచంద్ర రావునగర్ లోని చర్విత మెడోస్ లో ఆయన రోబోటిక్ కాంక్రిట్ త్రీడీ ప్రింటర్ ను సింప్లీ ఫోర్జ్ క్రియేషన్ వ్యవస్థాపకుడు అమిత్ గులె, సీఈఓ ధ్రువ్ గాంధీ లతో కలిసి ఓపెన్​చేశారు. మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ భవిష్కత్తులో ఈ టెక్నాలజీకి ఎంతో డిమాండ్​ ఉంటుందని, మనుషులు చేయలేని పనులను కూడా ఈ మెషీన్లు చేస్తాయన్నారు. చర్విత మెడోస్ ఎండీ, సీఈఓ హరికృష్ణ, పీఓ అజ్మత్ ఖాన్ పాల్గొన్నారు.