జంట జలాశయాలకు భారీగా వరద నీరు

జంట జలాశయాలకు భారీగా వరద నీరు

ఎగువ ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షాలు కురవడంతో జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. రంగారెడ్డి జిల్లాలో గండిపేట, హిమాయత్ సాగర్ కు వరద ప్రవాహం భారీగా చేరుతోంది. హిమాయత్ సాగర్ 2 ఫీట్ల మేరా 4 గేట్లను, గండిపేట 4 ఫీట్ల మేరా 6 గేట్లను ఎత్తి.. నీటిని కిందకు వదిలారు. వికారాబాద్, శంకర్‌పల్లి, మోకిలా, పరిగి, షాబాద్, షాద్‌నగర్ నుండి జంట జలాశయాలకు భారీ గా వరద నీరు వచ్చి చేరుతోంది.

రాజేంద్రనగర్ నుండి హిమాయత్ సాగర్ వెళ్లే సర్వీసు రోడ్డును ట్రాఫిక్ పోలీసులు మూసి వేశారు. ప్రస్తుతం మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, జలమండలి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.