కడెం ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద

కడెం ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద

నిర్మల్ జిల్లా: ఎగువన నది పరివాహక  ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు డ్యాం వద్ద రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 697.67 అడుగుల వరకు నీరు నిల్వ ఉంది. ఇన్ ఫ్లో 8 వేల 766 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో  8 వేల 359 క్యూసెక్కులుగా ఉంది. పెరుగుతున్న వరద ప్రవాహానికి అనుగుణంగా గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. వరద పెరిగిన నేపథ్యంలో గేట్లు ఎత్తడానికి ముందు ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు.