13 ఎకరాల్లోని చెట్లను నరికిన .. గల్ఫ్​ ఆయిల్ ​కంపెనీకి రూ.లక్ష ఫైన్

13 ఎకరాల్లోని చెట్లను నరికిన .. గల్ఫ్​ ఆయిల్ ​కంపెనీకి రూ.లక్ష ఫైన్

 

  • కంపెనీ కాంపౌండ్​ అయినా పర్మిషన్​ తీస్కోవాలి
  • జీహెచ్ఎంసీ, అటవీ శాఖ అధికారులు స్పష్టం

హైదరాబాద్, వెలుగు: అనుమతి లేకుండా చెట్లను నరికినందుకు అటవీశాఖ అధికారులు ఓ ఆయిల్​కంపెనీకి రూ.లక్ష ఫైన్​విధించారు. ఇష్టానుసారం పచ్చదనానికి గండి కొడితే వాల్టా యాక్ట్​ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. మూసాపేటలోని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆవరణలో 13 ఎకరాల్లో ఏపుగా పెరిగిన చెట్లను యాజమాన్యం నరికి వేయించింది. 

అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కంపెనీ కార్యకలాపాల కోసం చెట్లను నరికించి, జేసీబీతో చదును చేయించినట్లు ఆరోపిస్తూ సిటీకి చెందిన సోషల్ యాక్టివిస్ట్​వినయ్​వంగాల గత నెల 21 మేడ్చల్​జిల్లా అటవీశాఖ అధికారులకు ఎక్స్(ట్విట్టర్) ద్వారా ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు గల్ఫ్​ఆయిల్​కంపెనీకి రూ.లక్ష ఫైన్​ విధించారు.

 గత నెల 31న గల్ఫ్​యాజమాన్యం అటవీశాఖకు ఫైన్​చెల్లించింది. తాజాగా ఆ విషయం బయటికి వచ్చింది. గతంలో హెచ్ఎంటీలో చెట్లను నరికివేసినందుకు అటవీ అధికారులు రూ.60 వేల జరిమానా విధించారు. మేడ్చల్​జిల్లాలో 2022– 2023లో చెట్లు నరికిన వారికి రూ.25 లక్షలు, 2023–2024 మార్చి రూ.30 లక్షలు, ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.7 లక్షల జరిమానా విధించిన ట్లు అధికారులు తెలిపారు. చెట్లు కంపెనీల కాంపౌండ్​లోపల ఉన్నా, బయట ఉన్నా నరకాలంటే జిల్లా అటవీ శాఖ, జీహెచ్ఎంసీ అనుమతులు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా దూలపల్లి ఫారెస్ట్​ రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్ తెలిపారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.