నాకు నేనేపోటీ.. ఫామ్‌‌‌‌ కోల్పోలేదు

నాకు నేనేపోటీ.. ఫామ్‌‌‌‌ కోల్పోలేదు

లంక టూర్​లో కుల్దీప్‌‌‌‌తో కలిసి మెప్పిస్తా
టీమిండియా స్పిన్నర్​ యజ్వేంద్ర చహల్‌‌‌‌

న్యూఢిల్లీ: టీమిండియాలో తనో డిఫరెంట్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్​ను అంటున్నాడు చహల్. నేషనల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లో ఇతర స్పిన్నర్లతో తనకు పోటీ లేదని చెబుతున్నాడు. బాగా పెర్ఫామ్‌‌‌‌‌‌‌‌ చేస్తే టీమ్‌‌‌‌‌‌‌‌లో ఉంటామని, లేదంటే బయటికి వెళ్లాల్సి వస్తుందని స్పష్టం చేశాడు. అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్న రవీంద్ర జడేజాకు తోడు అక్షర్​ పటేల్‌‌‌‌‌‌‌‌, క్రునాల్ పాండ్యా కూడా నేషనల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చి మెప్పించారు. ఈ ముగ్గురు లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌  స్పిన్నర్ల  హవాలో  టీమ్‌‌‌‌‌‌‌‌లో చహల్‌‌‌‌‌‌‌‌కు ప్లేస్‌‌‌‌‌‌‌‌ లేకుండా పోయిందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. అయితే వీళ్లతో తనకు పోటీ ఉంటుందని అనుకోవడం లేదని చహల్‌‌‌‌‌‌‌‌ చెబుతున్నాడు. ‘నేనో  డిఫరెంట్‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌ను. పైగా నేను రిస్ట్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్​ను, వాళ్లు ఫింగర్​ స్పిన్నర్లు. కాబట్టి వాళ్లతో నాకు పోటీ ఉందని అనుకోవడం లేదు. నా పోటీ నాతోనే. బాగా పెర్ఫామ్‌‌‌‌‌‌‌‌ చేస్తే టీమ్‌‌‌‌‌‌‌‌లో ఉంటాం. లేదంటే బయటికి వెళ్లాలి’ అని చహల్‌‌‌‌‌‌‌‌  స్పష్టం చేశాడు.  కొన్నాళ్లుగా బాగా ఆడలేకపోతున్న తాను ఫామ్‌‌‌‌‌‌‌‌ కోల్పోలేదని చెప్పాడు. ‘ నేను చాన్నాళ్ల నుంచి ఆడుతున్నా. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో కూడా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నా. ఆడిన ప్రతీ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో వికెట్లు తీయలేం. ఓ బౌలర్​కు ​కొన్నిసార్లు  వికెట్లు పడగొట్టలేని కొన్ని మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఎదురవుతుంటాయి. దాన్ని బట్టి తను కోల్పోయాడు అనడానికి లేదు. అయితే, నేను వికెట్లు తీయడం చూసి  ప్రజలు అలవాటు పడ్డారు. ఈ లెవెల్‌‌‌‌‌‌‌‌కు చేరుకునేందుకు నేను చాలా హార్డ్‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌ చేశా. చాలా మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో వికెట్లు రాబడుతూ నా ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ను ఇంప్రెస్‌‌‌‌‌‌‌‌ చేశా. కాబట్టి నేను వికెట్లు తీయలేనప్పుడు సహజంగానే పోలికలు వస్తుంటాయి. అలాగే, ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ నిరుత్సాహపడతారు. అయితే, నేనైతే ఫామ్‌‌‌‌‌‌‌‌ కోల్పోలేదు. కొన్ని మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో బాగా పెర్ఫామ్‌‌‌‌‌‌‌‌ చేయలేదు. నా కెరీర్​లో ఇది ఒక ఫేజ్‌‌‌‌‌‌‌‌  మాత్రమే. ఇలాంటిది బ్యాట్స్​మెన్‌‌‌‌‌‌‌‌కు కూడా జరుగుతుంది. నాలుగైదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో బాగా స్కోర్​ చేయకపోతే వాళ్లపైనా విమర్శలు వస్తాయి. కానీ, తర్వాత అతను పరుగులు చేయడం స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తాడు. అలాగే,  మీరు కూడా నన్ను మళ్లీ వికెట్‌‌‌‌‌‌‌‌- టేకింగ్‌‌‌‌‌‌‌‌ మోడ్‌‌‌‌‌‌‌‌లో చూస్తారు’ అని 30 ఏళ్ల చహల్‌‌‌‌‌‌‌‌ చెప్పుకొచ్చాడు. 
కోహ్లీ సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికీ ఉంటుంది
నేషనల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చినప్పటి నుంచి చహల్‌‌‌‌‌‌‌‌కు కోహ్లీ అండగా నిలుస్తున్నాడు.  ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో అయితే చహల్‌‌‌‌‌‌‌‌ను కోహ్లీ ఎంతగానో ప్రోత్సహించాడు. ఇప్పుడు కూడా విరాట్‌‌‌‌‌‌‌‌ నుంచి తనకు ఫుల్‌‌‌‌‌‌‌‌ సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఉంటుందని లెగ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్​ భావిస్తున్నాడు. ‘విరాట్‌‌‌‌‌‌‌‌ నుంచి నాకెంతో సపోర్ట్‌‌‌‌‌‌‌‌ లభించింది. ముఖ్యంగా ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో నాకు చాలా ఫ్రీడమ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చేవాడు. నా దగ్గరకు వచ్చి నీకు నచ్చినట్టుగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేయి. ఎలాంటి మార్పులు వద్దు అని చెప్పేవాడు. తన మాటలు నన్ను ఎంతగానో మోటివేట్‌‌‌‌‌‌‌‌ చేశాయి. ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లోనే కాదు బయట కూడా నాకు ఎంతో సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తాడు. నేను బాగా పెర్ఫామ్‌‌‌‌‌‌‌‌ చేయనప్పుడు దగ్గరికి వచ్చి.. యుజీ, అతిగా ఆలోచించకు. ఎక్కువ ప్రెజర్​ తీసుకోకు. నిన్ను నువ్వు నమ్ము అంటూ ఎంకరేజ్‌‌‌‌‌‌‌‌ చేశాడు’ అని లెగ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్​ పేర్కొన్నాడు.
ఒకే టైమ్‌‌‌‌‌‌‌‌లో మూడు జట్లను కూడా పంపొచ్చు
కోహ్లీ కెప్టెన్సీలోని టెస్ట్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌లో ఉండగానే, మరో  లిమిటెడ్‌‌‌‌‌‌‌‌  ఓవర్ల టీమ్‌‌‌‌‌‌‌‌ లంక టూర్​కు వెళ్లనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు టీమ్స్‌‌‌‌‌‌‌‌ను కూడా ఈజీగా బరిలోకి దింపొచ్చని చహల్‌‌‌‌‌‌‌‌ అంటున్నాడు. ‘మన దగ్గర ఇప్పుడు చాలా ఆప్షన్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. మన టీమ్‌‌‌‌‌‌‌‌లో ఎంతో మంది స్టార్లు ఉన్నారు. బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌, బౌలింగ్‌‌‌‌‌‌‌‌, ఫీల్డింగ్‌‌‌‌‌‌‌‌ అన్నింటిలో చాలా ఆప్షన్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. కాబట్టి డిఫరెంట్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌ల  కోసం ఒకేసారి మూడు జట్లను సైతం ఈజీగా పంపించొచ్చు. నేనైతే శ్రీలంక టూర్​ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. అక్కడి పిచ్‌‌‌‌‌‌‌‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయి. ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌నకు ఈ టూర్​ను  ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌గా భావిస్తున్నా. వీలైనన్ని ఎక్కువ వైట్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌ ఆడటం టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో నాకు హెల్ప్‌‌‌‌‌‌‌‌ అవుతుంది. వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌ ఇండియాలో జరుగుతుంది కాబట్టి నేను బాగా పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తానన్న నమ్మకం ఉంది’ అని చహల్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించాడు.
ఇండియా లిమిటెడ్‌‌‌‌ ఓవర్ల టీమ్‌‌‌‌లో లెగ్‌‌‌‌ స్పిన్నర్​ యజ్వేంద్ర చహల్‌‌‌‌ ఓ సెన్సేషన్‌‌‌‌..! 2016లో డెబ్యూ చేసింది మొదలు తక్కువ కాలంలోనే స్టార్​ బౌలర్​గా పేరు తెచ్చుకున్నాడు..!  చైనామన్‌‌‌‌ కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌తో కలిసి ఎన్నో మ్యాచ్‌‌‌‌ల్లో  టీమ్‌‌‌‌కు విజయాలు అందించాడు..! కెప్టెన్‌‌‌‌ కోరిందే ఆలస్యం అన్నట్టు వికెట్లు తీశాడు..!  కానీ, అదంతా గతం. ఈ మధ్య కాలంలో చహల్‌‌‌‌ బంతి మ్యాజిక్‌‌‌‌ చేయడం లేదు..! టీమ్‌‌‌‌లో ట్రంప్‌‌‌‌ కార్డ్‌‌‌‌  అని పేరు తెచ్చుకున్న ఈ స్పిన్నర్​కు జట్టులో చోటే ప్రశ్నార్థకం అయింది..! అయినా తాను ఫామ్‌‌‌‌ కోల్పోలేదని అంటున్నాడు చహల్..!  కొన్ని మ్యాచ్‌‌‌‌ల్లో వికెట్లు రాబట్టలేకపోయినంత మాత్రాన తన పనైపోయినట్టు కాదని చెబుతున్నాడు..! తొందర్లోనే తనను మళ్లీ వికెట్‌‌‌‌ టేకింగ్‌‌‌‌ మోడ్‌‌‌‌లో చూస్తారని ఫ్యాన్స్‌‌‌‌కు భరోసా ఇస్తున్నాడు..!   శ్రీలంక టూర్​లో కుల్దీప్‌‌‌‌తో కలిసి మళ్లీ మ్యాజిక్‌‌‌‌  చేసేందుకు రెడీ అంటున్నాడు..!
‘టెస్ట్‌‌‌‌’ చాన్స్‌‌‌‌ కోసం వెయిటింగ్‌‌‌‌
2016లో టీ20ల్లోకి వచ్చిన చహల్ తొందర్లోనే వన్డేల్లోకి కూడా వచ్చాడు. ఇప్పటిదాకా 62 టీ20లు, 54 వన్డే మ్యాచ్‌‌‌‌లు ఆడాడు. కానీ, టెస్ట్‌‌‌‌ల్లో అవకాశం మాత్రం తనకు లభించలేదు. ఆ చాన్స్‌‌‌‌ కోసం వెయిట్‌‌‌‌ చేస్తున్నానని చహల్‌‌‌‌ చెప్పాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే టెస్టు టీమ్‌‌‌‌లో నా టర్న్‌‌‌‌ కోసం వెయిట్‌‌‌‌ చేస్తున్నా. ఫార్మాట్‌‌‌‌ ఏదైనా నా పని బాగా పెర్ఫామ్‌‌‌‌ చేయడమే. లిమిటెడ్‌‌‌‌ ఓవర్ల క్రికెట్‌‌‌‌తో పాటు ఐపీఎల్‌‌‌‌లో నన్ను నేను నిరూపించుకున్నా. ఇప్పుడు మరింత పరిణతి సాధించా. ఒత్తిడి ఎలా ఉంటుంది దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా బౌలింగ్‌‌‌‌ చేయగలను. అదే టైమ్‌‌‌‌లో  ప్రతి రోజూ ఎంతో కొంత నేర్చుకుంటున్నా.  టెస్టుల్లో అశ్విన్​, జడేజా బాగా రాణిస్తున్నారు. అక్షర్, కుల్దీప్‌‌‌‌ కూడా మెప్పించారు. ప్రస్తుతం టీమ్‌‌‌‌లో ఉన్న స్పిన్నర్లు బాగా రాణిస్తున్నారు. నేను కూడా వైట్‌‌‌‌బాల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లో పెర్ఫామ్‌‌‌‌ చేస్తున్నప్పటికీ ఇప్పటికిప్పుడు టెస్టుల్లో వాళ్లను భర్తీ చేయలేనని తెలుసు. ఎందుకంటే వాళ్లు టీమ్‌‌‌‌కు ఉపయోగపడే మంచి రిజల్ట్స్‌‌‌‌ ఇస్తున్నారు.  కాబట్టి ప్రస్తుతానికి  టెస్టు టీమ్‌‌‌‌లో నా అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. అంతే’ అని చహల్‌‌‌‌ చెప్పుకొచ్చాడు.