వచ్చేది యువ భారతం : మోడీ

వచ్చేది యువ భారతం : మోడీ

వచ్చే దశాబ్దంలో యువ భారతం కీలక పాత్ర పోషించబోతోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇప్పటి యువత వ్యవస్థను నమ్ముతున్నారని… వారి అభిప్రాయాలు కూడా విస్తృతంగా ఉంటున్నాయని చెప్పారు. తన రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ లో మోడీ మాట్లాడారు.

ఈ ఏడాది ఇదే చివరి మన్ కీ బాత్. ప్రస్తుతం యువత అస్థిరత, గందరగోళం, వారసత్వాన్ని ఇష్టపడడంలేదని చెప్పారు. వచ్చే దశాబ్దంలో ఇండియాను యువతే నడిపించబోతుందన్నారు.